పరిసరాల పరిశుభ్రతను కర్తవ్యంగా భావించాలి :వింజమూరు యం.పి.డి.ఓ కనకదుర్గా భవాని వింజమూరు, ఏప్రిల్ 9 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి) మండలంలోని ప్రజలు పరిసరాల పరిశుభ్రతను తమ ప్రధమ కర్తవ్యంగా భావించాలని వింజమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎస్.కనకదుర్గా భవానీ కోరారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తూ మన దేశంలో రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలకు సైతం విస్తరిస్తూ ప్రమాద ఘంటికలను తలపింపజేస్తున్నదన్నారు. వింజమూరు మండలంలో కరోనా నియంత్రణ టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు ఎప్పటికప్పుడు కరోనా మహమ్మారి దిశను నిశితంగా పరిశీలిస్తూ ఈ వైరస్ నివారణ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారన్నారు. ఇప్పటికే పలువురిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు క్వారంటైన్ల నందు ఉంచి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తూ ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఆదిలోనే అంతమొందించేందుకు అవిరళ కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. ముఖ్యంగా మేజర్ పంచాయితీ అయిన వింజమూరుతో పాటు మండలంలోని 12 గ్రామ పంచాయితీలలో, మజరా గ్రామాలలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశామన్నారు. అందుకు గానూ బ్లీచింగ్ ఫౌడర్, హైపో క్లోరైడ్ ద్రావణం, సున్నం తదితరాలను ఇప్పటికే పెద్ద మొత్తంలో సిద్ధం చేశామన్నారు. వింజమూరులోని ప్రధాన కాలువలు, డ్రైనేజీలలో నిరంతరాయంగా పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజలు కూడా పారిశుద్ధ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. చెత్తా చెదారమును విచ్చలవిడిగా రోడ్లుపై పడవేసి అపరిశుభ్రభరితమైన వాతావరణమును సృష్టించరాదని స్పష్టం చేశారు. దేవతామహల్ వద్ద నుండి ఆర్.టి.సి బస్టాండు కూడలి వరకు పలువురు రాత్రివేళల్లో చెత్తాచెదారమును రోడ్లపై వేస్తున్న సంధర్భాలు కోకొల్లులుగా ఉన్నాయన్నారు. ఇలాంటి పరిణామాలను సీరియస్ గా పరిగణించాల్సి ఉంటుందని యం.పి.డి.ఓ హెచ్చరించారు. చెత్తను త
పరిసరాల పరిశుభ్రతను కర్తవ్యంగా భావించాలి :ఎం.పి.డి.ఓ