రాజకీయాలు చేయడం మానుకోవాలి– భూమా అఖిలప్రియ 

తేదీః 07-04-20
భూమా అఖిలప్రియ విలేకరుల సమావేశం వివరాలు
కరోనా వైరస్ బారిన పడకుండా కర్నూలు ప్రజలు జాగ్రత్త వహించాలి- వైసీపీ నేతలు నగదు పంపిణీ పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలి– భూమా అఖిలప్రియ 
         కరోనా వైరస్ బారిన పడి అనేక దేశాలు విలవిలలాడుతున్నాయని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కరోనా వైరస్ నేడు మన ఇంటి గడప వరకు వచ్చిందంటే.. మనం అందరం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతోంది. కుటుంబసభ్యులను, స్నేహితులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. వయో వృద్ధులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. మరోవైపు రాష్ట్రంలో రూ.వెయ్యి మాత్రమే తెల్లరేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయి. కులాలు, మతాలు చూస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో మెరుగైన సాయం అందజేస్తున్నారు. మరోవైపు నగదు పంపిణీ పేరుతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. ఇది దురదృష్టకరం. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేనిపక్షంలో రైతులు వైసీపీ నాయకుల్ని క్షమించరు. వాలంటీర్లు, ఆశావర్కర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్, రేషన్ ఇస్తున్నారు. వీరికి ఎలాంటి మాస్క్ లు, గ్లౌజులు, శానిటైజర్లు లేవు. వీరికి వెంటనే మాస్క్ లు, గ్లౌజులు పంపిణీ చేయాలి. పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కడా సేఫ్టీ ఎక్విప్ మెంట్స్ లేవు. వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు మనం ధన్యవాదాలు తెలపాలి. వీరంతా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఓ వైపు డబ్బులు లేవంటూనే రూ.6400 కోట్ల రూపాయల బిల్లులను జగన్ విడుదల చేశారు. ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. ప్రజలకు సేవ చేసే వారికి ఎలాంటి రక్షణ ఇవ్వడం లేదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా జగన్ నిర్ణయాలు తీసుకోవాలి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కర్నూలులో మూడు రోజుల క్రితం 4 కేసులు ఉండగా.. నేడు 75పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనిపై జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కేసులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు కూడా జాగ్రత్త వహించాలి. వైసీపీ నాయకులు పబ్లిసిటీ మానుకుని ప్రజలను సేఫ్ జోన్ లో ఉంచాలి. వీరిని రిస్క్ లో పెట్టవద్దని వైసీపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆహారం లేని వారికి, ఇబ్బందులు పడుతున్న వారికి టీడీపీ తరపున సాయం అందజేయడం జరుగుతుంది.