పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం

పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్న ఏఎంసీ చైర్మన్ ఆలీఅహ్మద్... ఇటీవల రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి నెల్లూరు జిల్లాలోని చెన్నూరు పిడుగుపాటుకు వరికుంటపాడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన గంగవరపు శ్యామ్, పట్టిబోయిన ఆంజనేయులు, కుటుంబాలను ఆదివారం తాసిల్దార్  శ్రీనివాసులు, ఏఎంసీ చైర్మన్ ఆలీ అహ్మద్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా ప్రగాఢ సంతాపం తెలిపారు అనంతరం కుటుంబ సభ్యులకు నాలుగు లక్షల రూపాయల చెక్కులను వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గుంటుపల్లి ఆంజనేయులు ,వైసీపీ కన్వీనర్ మందలపు తిరపథి నాయుడు, గంగవరపు పుల్లయ్య, మాగంటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు