రైతు నోట ఆ మాట రావ‌ద్దు: సీఎం జ‌గ‌న్‌

రైతు నోట ఆ మాట రావ‌ద్దు: సీఎం జ‌గ‌న్‌
అమ‌రావ‌తి: ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చెప్పిన రేట్ల‌కే ఆక్వా ఉత్ప‌త్తులు అమ్ముడు పోవాల‌ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. వాటికి సంబంధించి లేబ‌ర్ స‌మ‌స్య‌తోపాటు ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. రైతు తాను కనీస రేటుకు అమ్ముకోలేకపోతున్నానన్న మాట రాకూడదని.. ఆ మేరకు చర్యలు తీసుకోవాల‌న్నారు. వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు, వాటి ధర‌లు, మార్కెటింగ్‌పై ఉభ‌య గోదావ‌రి, కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో సీఎం జ‌గ‌న్ బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయ‌ణ‌, మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఆక్వా పంట‌కు క‌నీస గిట్టుబాటు ధ‌ర‌లు రావాల‌ని ఆదేశించారు. ఎంపెడాలో చెప్పిన రేట్లకు కొనుగోలు చేయడానికి వాళ్లు ముందుకు రాకపోతే మీ ప్రత్యేక అధికారాలను వాడాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. జాతీయ విప‌త్తు స‌మ‌యంలో క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేక అధికారాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు. అవ‌స‌ర‌మైతే ఆ ప్రాసెసింగ్ యూనిట్‌ను స్వాధీనం చేసుకునేందుకు వెనుకాడ‌వ‌ద్ద‌ని సూచించారు. ముందుగా రైతుల దగ్గర నుంచి ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేసి వెంటనే ప్రాసెసింగ్‌ చేయాలని, అనంత‌రం మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలని తెలిపారు. ఒక‌వేళ‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు వెనుకడుగు వేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎక్స్‌పోర్ట్‌ మార్కెటింగ్‌ వాళ్లతో మాట్లాడి వెంటనే ఎగుమతి అయ్యేలా చూడాలన్నారు. ప్ర‌తిరోజు నిర్దిష్ట స‌మ‌యం కేటాయించుని వ్య‌వ‌సాయం, ఆక్వాకు సంబంధించిన ప‌రిస్థితుల గురించి నిరంత‌రం స‌మీక్ష నిర్వ‌హించాలని ఆదేశించారు. దీనికి వ్యవసాయశాఖ మంత్రి కుర‌సాల‌ కన్నబాబు, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అందుబాటులో ఉండి సమీక్షిస్తారని పేర్కొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు