*టమోటాల లోడుతో వెళుతున్న మినీ లారీ బోల్తా ఉదయగిరి, ఏప్రిల్ 9 (అంతిమతీర్పు- ఇంచార్ల్ దయాకర్ రెడ్డి) ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం 565 జాతీయ రహదారిపై గురువారం టమోటాల లోడుతో వెళుతున్న మినీ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. వివరాలలోకి వెళితే అనంతపురం జిల్లా కదిరి నుండి విజయవాడకు వెళుతున్న లారీ వరికుంటపాడు మండలంలో రామాపురం వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో లారీలోని ట్రేలలో ఉన్న టమోటాలు రోడ్డు వెంబడి చెల్లాచెదురుగా పడిపోయాయి. లారీలో ఉన్న వ్యక్యికి స్వల్పగాయాలయ్యాయి. అయితే పరిసర ప్రాంతాల ప్రజలు ఈ విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకుని టమోటాలను సంచులలో వేసుకుని వెళుతున్నారే గానీ గాయపడిన వ్యక్తిని పట్టించుకున్న దాఖలాలు లేవు. మానవత్వం మంటగలిసే విధంగా ఇక్కడ పరిస్థితి నెలకొంది. చివరికి కొందరు సహృదయులు గమనించి క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించారు.
టమోటాల లోడుతో వెళుతున్న మినీ లారీ బోల్తా