' కే.జి.ఆర్.వి.యస్ ' ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం - వింజమూరు తహసిల్ధారు సుధాకర్ రావు

' కే.జి.ఆర్.వి.యస్ ' ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం - వింజమూరు తహసిల్ధారు సుధాకర్ రావు..


. వింజమూరు, ఏప్రిల్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో కొండా వారి నేతృత్వంలోని కొండా.గరుడయ్య, రామచంద్రయ్య, వెంకట సుబ్బయ్య (కే.జి.ఆర్.వి.యస్) చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అజరామరం అని తహసిల్ధారు యం.వి.కే. సుధాకర్ రావు ప్రశంసించారు. స్థానిక తిరుమలానగర్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం నాడు పలువురు బ్రాహ్మణులకు కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ తరపున బియ్యం, కూరగాయలు పంపిణీకి ముఖ్య అతిధిగా హాజరైన తహసిల్ధారు సుధాకర్ రావు కొండా వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం జరిగిందన్నారు. ప్రజలందరూ కూడా స్వీయ నిర్భందం పాటించాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ సమయంలో ప్రతినిత్యం రెక్కాడితే గానీ డొక్కాడని విభిన్న సందర్భాలు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ప్రస్ఫుటించాయన్నారు. దేవాలయాలకు సైతం లాక్ డౌన్ ఆం క్షలు వర్తించడంతో బ్రాహ్మణుల జీవనభృతి కి కూడా కొంతమేర అవరోధాలు ఏర్పడటం విధిగా మారిందన్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటివరకు మండలంలో పేద ప్రజలకు వంట సరుకులు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు విరివిగా పంపిణీ చేసిన ఘనత కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ కు దక్కిందన్నారు. ఈ ట్రస్ట్ సభ్యులు తాజాగా మరొక  అడుగు ముందుకేసి నిరంతరం లోక సం రక్షణార్ధం వేద మంత్రాలు పఠించే బ్రాహ్మణోత్తములకు నిత్యావసరాలను అందజేయడం పట్ల కొండా వంశస్థులకు దైవ కృప ఎల్లవేళలా ఉండాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నామన్నారు. కొండా.చినసుబ్బరాయుడు ధర్మపత్ని అమ్మణ్ణమ్మ పేరిట బియ్యం పంపిణీ చేయగా, కీ.శే.సుంకు.సుబ్బరత్నమ్మ భర్త మాలకొండలరావు, మెంటా.పద్మావతి- భర్త కీ.శే.వెంకటేశ్వర్లు, చీమకుర్తి.విజయలక్ష్మి-భర్త చంద్రశేఖరయ్యల సహాయార్ధం కూరగాయలు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కొండా.బాలజుబ్రహ్మణ్యం, కొండా.వెంకటసుబ్బారావు, కొండా.చినసుబ్బరాయుడు, కొండా.చినవెంకటేశ్వర్లు, కొండా.ఝాన్సీలక్ష్మి, కొండా.చర్షిత, కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ పర్యవేక్షకులు దుగ్గి.మధు, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు పి.తిరుమలాచార్యులు పాల్గొన్నారు.