ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు:

*02.04.2020*
*అమరావతి*


*కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు లాక్‌ డౌన్‌ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం*


*రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న కోవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్‌


ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు:


రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 123 శాంపిల్స్‌ పరీక్షించగా వాటిలో 11 కేసులు పాజిటివ్‌గా, 112 కేసులు నెగటివ్‌గా తేలాయి.
దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 143కు చేరింది.
గురువారం ఒక్కరోజే కృష్ణా జిల్లాలో అత్యధికంగా 8 కోవిడ్‌–19 కేసులు నమోదు కాగా, నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్‌ కడప జిల్లాలలో ఒక్కో కేసు చొప్పున గుర్తించారు.
ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో అత్యధికంగా 23 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 21, గుంటూరు జిల్లాలో 20, ప్రకాశం జిల్లాలో 17, వైయస్సార్‌ కడప జిల్లాలో 16, పశ్చిమ గోదావరిలో 14, విశాఖపట్నం జిల్లాలో 11, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలలో 9 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
ఇక అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 1 కేసు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.


*కొత్తగా రెండు టెస్టింగ్‌ సెంటర్లు:*


రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కోవిడ్‌–19 కేసులను దృష్టిలో ఉంచుకుని గుంటూరు, కడపలో కొత్తగా మరో రెండు టెస్టింగ్‌ సెంటర్లు ఏర్పాటు.
గుంటూరు సెంటర్‌ శుక్రవారం నుంచి, కడప సెంటర్‌ శనివారం నుంచి అందుబాటులోకి
దీంతో మొత్తం టెస్టింగ్‌ సెంటర్ల ఆరుకు చేరుకోగా, వాటిలో రోజుకు పరీక్షల సామర్థ్యం 450 నుంచి 570కి పెరిగింది.
మరోవైపు విశాఖపట్నంలో రెండో సెంటర్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు.


*తబ్లిగీ జమాత్‌ ప్రభావం:*


ఢిల్లీ హజ్రత్‌ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ భవన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌లో జరిగిన సమావేశానికి రాష్ట్రం నుంచి 1085 మంది హాజరయ్యారు.
వారిలో 758 మందిని గుర్తించి శాంపిల్స్‌ సేకరించి పరీక్షించగా, 91 మంది రిపోర్టు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా వచ్చింది.
దీంతో ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిలో దాదాపు 16 శాతం మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు.
వారందరి సమాచారం ప్రభుత్వం వద్ద ఉండగా, మిగిలిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.


ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:
కోవిడ్‌ –19ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధానాలు అనుసరిస్తోంది:
విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో 2012 నాన్‌ ఐసీయూ బెడ్లు, 444 ఐసీయూ బెడ్లతో ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రులను నెలకొల్పాం: 
13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కోవిడ్‌ –19 వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ఆస్పత్రులను కేటాయించాం:
10,933 నాన్‌ ఐసీయూ బెడ్స్, 622 ఐసీయూ బెడ్స్‌ ఆ ఆస్పత్రుల్లో సిద్ధం చేశాం:
మొత్తంగా 1000 ఐసీయూ బెడ్లను సిద్ధం చేశాం:
దీనికి తోడు ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఐసోలేషన్‌ కోసం మరో 20 వేల బెడ్లను రెడీగా ఉంచాం:
ఫిబ్రవరి 10, 2020 నుంచి ఇప్పటివరకూ 27,876 మందికి పైగా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు:
వారిలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 10,540 మంది కాగా  17,336 మంది రూరల్‌ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు:
వారిని తరచు కలిసిన వారు, సన్నిహితంగా మెలిగిన వారు, వారి కుటుంబ సభ్యులు.. అంటే మొత్తంగా ప్రైమరీ కాంటాక్టŠస్‌ 80,896 మంది ఉన్నారు:
వారందరూ కూడా పూర్తి పర్యవేక్షణలో ఉన్నారు:
రాష్ట్రంలో ఇప్పటివరకూ 132 మందికి కోవిడ్‌ –19 సోకింది:
ఇందులో 111 మంది తబ్లీగ్‌ జమాతేకు వెళ్లిన వారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారే:
91 మంది తబ్లీగ్‌ జమాతేకు వెళ్తే, మరో 20 మందికి కాంటాక్ట్‌ కావడం ద్వారా ఈ వైరస్‌ సోకింది: సీఎం శ్రీ వైయస్‌ జగన్‌


*ఇక జిల్లాల వారీగా వివరాలు:*


*శ్రీకాకుళం జిల్లా:*


– ముస్లిం మైనారిటీలతో జిల్లా పరిషత్‌లో జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ సమావేశం నిర్వహించారు.
– జిల్లా నుండి ఢిల్లీ జమాత్‌ కు వెళ్లిన వారు ఎవరూ లేరు.
– అయినా మార్చి 14 నుంచి 22 వరకు ఢిల్లీ వెళ్లిన వారి వివరాలు సేకరిస్తున్నాం. 67 మంది ఢిల్లీ వెళ్లినట్లు రైల్వే జాబితా వచ్చింది: కలెక్టర్‌
– ఆ జాబితా ప్రకారం జిల్లా నుంచి 27 మంది ఢిల్లీ వెళ్లి వచ్చినట్లు తేలింది: కలెక్టర్‌ జె.నివాస్‌
– జిల్లాలో 27 మంది నమూనాలు సేకరించి పరీక్షించగా 12 కేసుల్లో నెగటివ్‌ రిపోర్టు వచ్చింది. మిగిలిన శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.
– జిల్లాలో జెమ్స్, జిఎంఆర్‌ ఆస్పత్రులను కోవిడ్‌–19 ఆస్పత్రులుగా గుర్తించారు.


*విజయనగరం జిల్లా:*


– నెల్లిమర్ల మండలం రామతీర్ధంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబంరంగా నిర్వహించారు. 
– కరోనా వైరస్‌ కారణంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు వీలుగా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లతో సన్నద్ధంగా వుండాలని కరోనా సహాయక చర్యలపై జిల్లా ప్రత్యెక అధికారిగా నియమితులైన సీనియర్‌ ఐఏఎస్‌ వివేక్‌ యాదవ్‌ ఆదేశాలు.
– జిల్లాలో కరోనా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం నోడల్‌ ఆసుపత్రిగా గుర్తించిన మిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించిన వివేక్‌యాదవ్‌.
– ఆసుపత్రిలో క్రిటికల్‌ కేర్‌ అవసరమైన రోగులకు సిద్ధం చేసిన ఐసియు గదులు, నాన్‌ ఐసియు గదులను పరిశీలించిన ప్రత్యేక అధికారి.
– వైద్య సేవలందించే సిబ్బంది తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) సమకూర్చుకోవాలని ఆదేశం.


*విశాఖపట్నం జిల్లా:*


– జిల్లాలో కూరగాయల సరఫరాలో ఇబ్బంది కలగకుండా ఇప్పటికే 13 రైతు బజార్లు ఉండగా, అదనంగా 62 రైతు బజార్లు ఏర్పాటు చేశారు.
– మరోవైపు 57 మొబైల్‌ రైతు బజార్లు కూడా నిర్వహిస్తూ, ప్రజలకు అవసరమైన కూరగాయలు, నిత్యావసరాలు అందేలా చూస్తున్నారు.
– మరో 1500 కుటుంబాలకు హోం డెలివరీ విధానంలో నిత్యావసరాలు సరఫరా చేశారు.
– ఇక నగర పరిధిలో 484 రేషన్‌ షాపులు, గ్రామీణ ప్రాంతాల్లో 1244 రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం, పప్పు పంపిణీ చేస్తున్నారు.


*తూర్పుగోదావరి జిల్లా:*


– జిల్లాలో 281 కరోనా వైరస్‌ లక్షణాల అనుమానిత కేసుల శాంపిళ్లను లాబ్‌ పరీక్షలకు పంపగా, 226 కేసులు వైరస్‌ నెగిటీవ్‌ గా నిర్థారణ అయ్యాయని, 6 కేసులలో వైరస్‌ పాజీటీవ్‌ గా తేలిందని, మరో 49 శాంపిళ్లకు టెస్ట్‌ రిపోర్టులు రావలసి ఉందని వైద్య ఆరోగ్య శాఖ నోడల్‌ అధికారి తెలిపారు.
– కరోనా వైరస్‌ నివారణ చర్యలలో భాగంగా జిల్లాలో 165 క్వారంటైన్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అలాగే 6,509 ఐసోలేషన్‌ బెడ్లు ఏర్పాటు చేశారు.
– కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న 3441 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లోను, 352 మందిని క్వారంటైన్‌ సెంటర్లలోను ఉంచి వారి ఆరోగ్య పరిస్థిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
– రాజానగరం, రాజమండ్రి, అమలాపురం లో ఏర్పాటు చేసిన జిల్లా కోవిడ్‌–19 ప్రత్యేక ఆస్పత్రులలో 1322 నాన్‌ ఐసియు బెడ్లు, 127 ఐసియు బెడ్లు సిద్ధం చేశారు. 
– జిల్లాలో 14.65 లక్షల కుటుంబాలను హౌస్‌ టు హౌస్‌ సర్వే టీములు సందర్శించి మొత్తం 17,658 మందిని కోవిడ్‌–19 సర్వైలెన్స్‌లో ఉంచారు.
– వారిలో 12,083 మంది గ్రామీణ ప్రజలుండగా, పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 5575 మంది ఉన్నారు.
– విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 3442 మందిలో 1231 మంది 28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకోగా, 1749 మంది 15 నుంచి 28 రోజుల పర్యవేక్షణ కాలంలో ఉండగా, మరో 462 మంది 14 రోజుల లోపు పర్యవేక్షణలో ఉన్నారు. 
– డిల్లీలో మతపరమైన సమావేశానికి హాజరై వచ్చిన 26 మంది వ్యక్తులను ట్రాక్‌ చేసి కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించారు.
– వారిలో ముగ్గురికి కరోనా పోజిటీవ్‌ అని తేలగా, 23 మంది రిపోర్టు నెగటివ్‌గా వచ్చింది.
– జిల్లాలో ఇప్పటి వరకు గుర్తించిన 6 పాజిటీవ్‌ కేసులలో ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారా వైరస్‌ సోకిన వారు ఒకరు విదేశాల నుండి వచ్చిన వ్యక్తి కాగా, ముగ్గురు డిల్లీలో మత కార్యక్రమానికి హాజరై వచ్చిన వారు.
– మరో ఇద్దరికి సెకంటరీ కాంటాక్ట్‌ ద్వారా వైరస్‌ సోకినట్లు గుర్తించారు.


*పశ్చిమ గోదావరి జిల్లా:*


– గురువారం కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో 3 కిలో మీటర్ల మేర సూపర్‌ క్లీనింగ్‌ చేయిస్తున్న అధికారులు
– ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తింపు.
– పాజిటివ్‌ రిపోర్టులు వచ్చిన వారిని ఐసోలేషన్‌ వార్డులకు తరలింపు
– రిపోర్టులు రానివారిని క్వారంటైన్‌కు తరలించిన అధికారులు.
– ఢిల్లీ నుంచి వచ్చిన వారితో టచ్‌లో ఉన్న వారిని గుర్తించడానికి చురుగ్గా సాగుతున్న సర్వే.
– ఇప్పటికే గుర్తించిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి, హోం క్వారంటైన్‌లో ఉండేలా అధికారులు చర్యలు.
– జిల్లాలో 14 కరోనా కేసులు నమోదు.
– జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేలా అధికారులు కఠిన చర్యలు.
– 15 కరోనా కేసుల నమోదుతో అధికారులు మరింత అప్రమత్తం 


*కృష్ణా జిల్లా:*


– జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 23 కేసులు నమోదు అయ్యాయి.
– ఈ రోజు మొత్తం 178 నమూనాలు సేకరించగా, 17  పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి
– విజయవాడ నగరంలో ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన ఒకే కుటుంబంలో 7 మందికి కరోనా పాజిటివ్‌ గా తేలింది.
– మరో 36 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది.
– విజయవాడలోని చిట్టినగర్, కుండల మార్కెట్‌ వద్ద ఢిల్లీ నుంచి వచ్చిన 13 మందిని క్వారంటైన్‌కు తరలించారు.
– మచిలీపట్నం డివిజన్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన 20 మందిని క్వారంటైన్‌కు తరలించారు.
– గుడివాడ డివిజన్‌ పరిధిలో కరోనా వైరస్‌కు సంబందించి పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు.
– డివిజన్‌ పరిధిలో విదేశాల నుండి వచ్చిన వారు 136 మంది ఉండగా, వారు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు ప్రతి రోజు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 


*గుంటూరు జిల్లా:*


– జిల్లాలో ఇప్పటి వరకు 20 పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 302 శాంపిల్స్‌ సేకరించి పరీక్షించగా వాటిలో 20 పాజిటివ్,  275 నెగెటివ్‌ రాగా, ఇంకా ఏడింటి ఫలితాలు రావాల్సి ఉంది.
– పాజిటివ్‌గా వచ్చిన వాటిలో ఎక్కువగా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారివే ఉన్నాయి. 
– కరోనా పాజిటివ్‌ కేసుల్లో గుంటూరు నగరంలో 9, మాచర్లలో 5, అచ్చంపేటలో 3, క్రోసూరు, కారంపూడి, మంగళగిరిలో 1 చొప్పున ఉన్నాయి.
– ఢిల్లీ మత ప్రార్ధనకు వెళ్లి వచ్చిన వారు 187 మందిగా ప్రాధమిక అంచనాకు వచ్చిన యంత్రాంగం ఇప్పటి వరకు 146 మందిని ట్రేస్‌ చేసి శాంపిల్స్‌ సేకరించారు.
– జిల్లాలో 28 క్వారంటైన్‌ కేంద్రాలుండగా, వాటిని 72కు పెంచేందుకు చర్యలు చేపట్టారు. 
– ఇక క్వారంటైన్‌ కేంద్రాల్లో 118 విదేశీ ప్రయాణీకులుండగా, వారిలోనే మరో 2087 మంది స్వీయ గ్రుహ నిర్బంధంలో ఉన్నారు.
– కరోనా చికిత్స కోసం జిల్లాలో 15 వేల బెడ్లు సిద్దం చేస్తున్నారు.
– మరోవైపు 8 నుంచి 9 వరకు ఆస్పత్రి ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.


*ప్రకాశం జిల్లా:*


– జిల్లాలో కొత్తగా 2 పాజిటివ్‌ కేసులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 17 పాజిటివ్‌ కేసులు గుర్తించారు.
– హోమ్‌ ఐసోలేషన్‌లో 1000 మంది అబ్జర్వేషన్‌లో ఉన్నారు.
– మండలానికి ఒక క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు.
– కరోనా రిలీఫ్‌ సెంటర్స్‌లో మంచి మెనూతో భోజన వసతి కల్పిస్తున్నారు.
– రైతులు పొలం పనులు చేసేటప్పుడు సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించాలని అధికారుల సూచన.


*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:*


– జిల్లా నుంచి ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో 103 మంది శాంపిల్స్‌ పరీక్షలకు పంపగా, ఈరోజు 17 పాజిటివ్‌ కేసులు కలిపి మొత్తం 19 పాజిటివ్‌ కేసులు తేలాయి. ఇంకా కొందరి పరీక్షా ఫలితాలు రావాల్సి ఉంది.
– మరోవైపు మెజార్టీ లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు.
– హోం ఐసోలేషన్‌లో 961 మంది ఉన్నారు.
– ఆస్పత్రి క్వారంటైన్‌లో 140 మంది ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రి హోం ఐసోలేషన్‌లో 19 మంది ఉన్నారు.
– ఆన్‌ లైన్‌లో నిత్యావసరాలు, 110 సంచార కూరగాయల విక్రయ వాహనాల ద్వారా కూరగాయల పంపిణీ.
– మార్కెటింగ్‌ శాఖచే రూ.100 కూరగాయల కిట్‌ వినియోగదారులుకి పంపిణీ
– జిల్లాకు విదేశాల నుంచి 1,557 మంది రాగా, వారిపై నిఘా.
– హోమ్‌ ఐసోలేషన్లో 2,200 బెడ్లు అందుబాటులో ఉన్నాయి.


*చిత్తూరు జిల్లా:*


జిల్లాలో తాజాగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8కి చేరింది.
– దీంతో జిల్లా యంత్రాంగం మొత్తం కరోనాను ఎదుర్కొనే పనిలో నిమగ్నమైంది.
– జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 52 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఇందులో 15 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు.
– మరో 69 మంది రక్త పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.


*అనంతపురం జిల్లా:*


 కరోనా వైరస్‌ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లన్నీ తప్పనిసరిగా పని చేయాలని, ఎవరైనా మూసివేస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు హెచ్చరించారు. జిల్లాలో కొన్నిచోట్ల ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లు మూసి వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లు మూసి వేయరాదని, ఎవరైనా మూసి వేస్తే ఆ నర్సింగ్‌ హోమ్‌ల యజమానులు, డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.
 మరోవైపు లాక్‌ డౌన్‌ నేపథ్యంలో 53 స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పలు చోట్ల నిరుపేదలకు భోజనంతో పాటు, వాటర్‌ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
 అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ పిచికారి చేశారు. వాటర్‌ ట్యాంక్‌లు శుభ్రపర్చారు. 
 జిల్లావ్యాప్తంగా 5,05,753 పింఛనుదార్లు ఉండగా, 95 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ చేశారు.


*వైయస్సార్‌ కడప జిల్లా:*


 జిల్లాలో నిన్న 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కరోనా నివారణకు జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌ బి.అంజాద్‌ బాషా తెలిపారు. దీంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.
 జిల్లాలో మొత్తం 220 శాంపిల్స్‌ను టెస్ట్‌ చేయగా వాటిలో 15 పాజిటివ్‌ కేసులు వచ్చాయని, ఇంకా 32 శాంపిల్స్‌ రిపోర్టు రావాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లాలో పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించి కడప నగరాన్ని లాక్‌ డౌన్‌  చేయడం జరిగిందన్నారు. రెండు పాజిటివ్‌ కేసులను తిరుపతి పద్మావతి మెడికల్‌ కళాశాలకు పంపడం జరిగిందన్నారు. జిల్లాలో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని క్వారంటైన్‌ లో ఉంచడం జరిగిందన్నారు.
 కరోనా అనుమానిత వ్యక్తులు 28 రోజుల పాటు క్వారం టైన్‌ లో ఉండాల్సి ఉంటుందన్నారు. ఆ 28  రోజులు ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోతే వారి ఇంటికి పంపడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి వివరించారు.


*కర్నూలు జిల్లా:*


– కర్నూలు నగరం జొహరాపురంలో ఉన్న కిమ్స్‌ హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌.
– కరోనా వైరస్‌ నియంత్రణ నేపథ్యంలో పాజిటివ్‌ రోగులకు నిర్బంధ గదులలో సౌకర్యాలు లేకుండా వైద్య సేవలను అందించడం వంటి సమస్యలు, పరిష్కార మార్గాలపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన జిల్లా కలెక్టర్‌.
– మరోవైపు జిల్లాలో 4.22 లక్షల మంది లబ్ధిదారులకు రూ.101.30 కోట్ల పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికే 95 శాతం మేర దాదాపు రూ.95 కోట్లు, 4.02 లక్షల మందికి పంపిణీ చేశారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image