క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన అధికారులు

క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన అధికారులు


వింజమూరు, ఏప్రిల్ 24 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరుకు సమీపంలోని కావలి-కడప మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న కళాశాలను క్వారంటైన్ సెంటరుగా ఉంచేందుకు శుక్రవారం సాయంత్రం మండల కరోనా నియంత్రణ టాస్క్ ఫోర్స్ ముఖ్య సభ్యుల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాలలో వసతులు, మరుగుదొడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో క్వారంటైన్ సెంటరుకు అనుకూలంగా ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. వింజమూరు మండలంలో ఇప్పటి వరకు ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోగా గ్రీన్ జోన్ గా ప్రకటించి ఉన్నారు. అయినప్పటికీ జిల్లాలో ఈ వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ పరిశీలనలో తహసిల్ధారు సుధాకర్ రావు, వైధ్యాధికారి హరిక్రిష్ణ, ఎస్.ఐ బాజిరెడ్డి, యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి, వి.ఆర్.ఓ వెంగయ్యలు పాల్గొన్నారు.