పాలన ఎలా చేయాలో చంద్రబాబు దగ్గర జగన్ నేర్చుకోవాలి :    దేవినేని ఉమా మహేశ్వర రావు

12.04.2020
విలేకర్ల సమావేశం వివరాలు
వైసీపీది అసమర్థ పాలన
పాలన ఎలా చేయాలో చంద్రబాబు దగ్గర జగన్ నేర్చుకోవాలి
ప్రజల ప్రాణాలకంటే విశాఖ వెళ్లడమే జగన్ కు ముఖ్యం
ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం పెట్టడమేంటి?
                                                                  దేవినేని ఉమా మహేశ్వర రావు


కరోనా మహమ్మారి ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 17 లక్షల 90 వేల 550 కేసులు నమోదయ్యయి. లక్షా 9 వేల 654 మంది కరోనా బారిన పడి చనిపోయారు. భారతదేశంలో 8 వేల 731 కేసుల్లో 290 మంది చనిపోయినట్ట తెలుస్తోంది. ఏపీలో 405 కేసులు నమోదవగా ఆరుగురు చనిపోయారు. తెలంగాణలో 503 పాజిటివ్ కేసులు నమోదవగా 14 మంది చనిపోయారు. ఊరందరిదీ ఒక దారి ఉలిపి కట్టది ఒక దారి అన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి.  దేశంలో అందరు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం జోన్లు , మండలాల గురించి మాట్లాడుతున్నారు. 30, 40 మండలాల్లోనే కరోనా ఉంది కాబట్టి జోన్ల వరకే లాక్ డౌన్ పరిమితం చేయమని మాట్లాడుతున్నారు. మూడు ముక్కలాటలో భాగంగా ఏప్రిల్ 28కల్లా తట్టాబుట్టా సర్దుకుని విశాఖ పట్నం వెళ్లడానికి రెడీ అవుతున్నారు. విశాఖపట్నం స్వామి పెట్టిన ముహూర్తానికే వెళ్లడానికి సిద్ధమైపోతున్నారు. సీఆర్డీఏ పరిధిలో ఈ రెండు రోజుల్లో ఇద్దరు రైతులు చనిపోయారు. భూములు ఇమ్మని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. రాజధాని రైతులు ఆందోళనను పట్టించుకోకుండా గ్రూప్  కాన్ఫరెన్స్, స్కైప్ వీడియా కాన్ఫరెన్స్ కు రమ్మని రైతు కూలీల మీద ఒత్తిడి తేవడం వల్లే ఇద్దరు రైతులు చనిపోయారు. సుమారు 60 మంది రైతులు అమరావతి ప్రాంతంలో చనిపోయారు. ఏప్రిల్ 24వ తేదీ వరకు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కరోనా  ఏం లేదని చెబుతున్నారు. ఏపీకి ఎక్కువ నిధులు తెచ్చుకోవడం, ఉపాధి హామీతో రైతులను కాపాడే అంశాలను పక్కన పెట్టి కరోనాను 30, 40 మండలాలకు పరిమితం చేయండని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో చెబుతున్నారు.  మేము ఎన్నికలు పెట్టుకుంటాం, ఎలక్షన్ కమిషనర్ ను మార్చుకున్నామని మొండిగా ముందుకు పోతున్నారు.  రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తున్నారు.  243 కే సబ్ క్లాజ్ 2 రాజ్యాంగంలో ఏదైతే చెప్పబడి ఉందో దాన్ని ఇష్టానుసారంగా మార్చేసుకున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో మార్చి 15న ఎస్ ఈసీ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రాణాలను కాపాడారు. తమ ప్రాణాలను రమేష్ కుమార్ కాపాడారని ప్రజలు జేజేలు పలికారు. ఆంధ్రా ప్రజలంతా మహేష్ బాబు స్పైడర్ సినిమా చూడండి అందులో భైరవుడు అనే క్యారెక్టర్ ఉంది. శాడిస్ట్ అతను. ప్రజలు చనిపోతూ ఉంటే భైరవుడు ఆనందపడతాడు. ప్రజలంతా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని స్వీయనియంత్రణ పాటిస్తున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ చంద్రబాబు ప్రతి రోజూ ప్రజలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇక్కడ బాధ్యతలేని మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు అమరావతి వస్తే క్వారంటైన్ లో పెడతామంటున్నారు. బుద్ది ఉందా మీకు ..చదువుకునే పిల్లలు, చిన్న పనులు చేసుకునే వారు తెలంగాణ సరిహద్దుల్లో కన్నీరు మున్నీరవుతుంటే మీరేం చేశారు...వారందరినీ తిప్పి పంపారు. వారిని 14 రోజులు క్వారంటైన్ లో పెట్టమని హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఇవాళ ఎలక్షన్ కమిషనర్ కనగరాజ్ గారిని క్వారంటైన్ లో పెట్టారా?  ఇటు విజయవాడ, విశాఖ , హైదరాబాద్ , మద్రాస్ మధ్య ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్న విజయసాయి రెడ్డి క్వారంటైన్ లో ఉన్నారా ? చెక్కులు పట్టుకుని పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు. అంటే కోట్ల రూపాయల చెక్కులు తీసుకొస్తే క్వారంటైన్ లు అవసరం లేదు. ఉద్యోగాలు చేసుకుని ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని వచ్చిన వారు మాత్రం నిబంధనలు పాటించాలి. రాష్ట్ర ప్రతిపక్ష నేతను క్వారంటైన్ లో పెడతామంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాలన చేతకాదు...పాదయాత్రలో పెద్ద మాటలు చెప్పారు జగన్ ..పాలన ఎవరి చేతుల్లో ఉంది? రాష్ట్ర ఖజానా ఎవరి చేతుల్లో ఉంది? ముఖ్యమంత్రి నేనా నువ్వా అని జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద దీర్ఘాలు తీశారు . ఇవాళ తాడేపల్లి రాజప్రసాదం వదిలిపెట్టి బయటకు కూడా రావడంలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల పిల్లలు క్వారంటైన్ ల లెక్కల్లోకి రారు. ఐదు కోట్ల ప్రజలు, ప్రతిపక్ష నేత మాత్రం క్వారంటైన్ లో ఉండాలి. సిగ్గుందా మీకు? నోరు ఉందికదా అని హద్దూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారు...చెప్పమనండి నాకు పరిపాలన చేతకాదు, నేను పాలన చేయలేకపోతున్నానని చెప్పమనండి...పాలన ఎలా చేయాలో చంద్రబాబుగారిని నేర్పమనండి చేసి చూపించమనండి మేము రెఢీ. ఇవాళ గ్రామాల్లో షుగర్, బీపీ బిళ్లలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరిచ్చే వెయ్యి రూపాయలతో కుటుంబాన్నే నడపాలా లేక మందులే కొనుక్కోవాలో సమాధానం చెప్పండి. ఐదు వేల రూపాయలు పేదల అకౌంట్ లో వేయమంటే అధికార పార్టీ నేతలకు ఎగతాళిగా ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రభుత్వానికి తెలియవు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉద్దరించిన గోపాలకృష్ణ ద్వివేదీని పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టారు. ద్వివేదీ కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా జీవోలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి , ధనుంజయ్ రెడ్డి , అజేయ కల్లాంరెడ్డి దుర్మార్గమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి మొత్తం రాజ్యాంగస్పూర్తికి విరుద్దంగా పనిచేశారు. మీకు హైకోర్టు, సుప్రీంకోర్టులో మొట్టికాయలు తప్పవు. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం ఊడినా ఆశ్చర్యం లేదు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు అమరావతి కోసం పోరాడుతుంటే మీ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. హైకోర్టు తీర్పులు కూడా లెక్కలేదు. గవర్నర్ కార్యాలయాన్ని చూస్తుంటే రామ్ లాల్ ఉదంతాలు గుర్తొస్తున్నాయి. పవిత్రమైన స్థలంలో గవర్నర్ కార్యాలయం పనిచేస్తోంది. రాబోయే రోజుల్లో చెడ్డపేరు తెచ్చుకోవద్దు. ఆర్డినెన్స్ విషయంలో ప్రభుత్వానికి వంత పాడటం సరికాదు. ఎన్నికలు వాయిదా వేసి ప్రజల ప్రాణాలు కాపాడిన రమేష్ కుమార్ ను పంపేందుకు గవర్నర్ కార్యాలయం ఆర్డినెన్స్ కు మద్దతు ఇవ్వడం సరికాదు. కనగరాజ్ కు అరబిందోకు సంబంధం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటికి విజయసాయి రెడ్డే సమాధానం చెప్పాలి. దుర్మార్గమైన కార్యక్రమాలను విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి కనుసన్నల్లోనే జగన్ జరిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి బినామీ అయిన అరబిందో ఫార్మా విశాఖ, విజయనగరం చుట్టుపక్కల వేలాది ఎకరాలను కొన్నారు. కృష్ణా , గుంటూరు జిల్లాల్లోని లంక భూముల్లో అరటి పంట పూర్తిగా పోయింది. విజయవాడ స్టేడియంలో పులివెందుల అరటిని అమ్మమని ముఖ్యమంత్రి చెబుతున్నారంటే ఏమనాలి? మీ మంత్రులు, ఎమ్మెల్యేలు పంపించే టమాటానే కొనాలంటే రైతులు కన్నీరు పెడుతున్నారు. 10 లక్షల టన్నుల మామిడి రాలిపోతోంది. కలెక్టర్ సహా అధికారులు పంటను కొనుగోలు చేసి రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు. మంత్రులు ఇసుక తోలుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా మట్టి తరలిస్తున్నారు. మైలవరం , పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గంలో టన్నుల టన్నుల లారీల ఇసుకను లాక్ డౌన్ ఎత్తేశాక తరలించేందుకు సిద్ధమవుతున్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి. అన్నీ వీడియో రికార్డింగ్ లే. చేతకాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి. పాలన ఎలా చేయాలో మేం చెప్తాం. మల్లె పంట చేలోనే రాలిపోయి రైతు 20 కోట్లు నష్టపోయాడు. రాయలసీమలో ఉద్యానపంట నేలకొరిగింది. నెల్లూరు జిల్లాలో పిడుగుపడి ఆరుగురు చనిపోయారు. ఆర్టీజీని మీరు ఎందుకు వాడుకోవడం లేదు?  మెడ్ టెక్ జోన్ చంద్రబాబు గారి దూరదృష్టికి నిదర్శనం...మంత్రులేమో జగన్ అభివృద్ది చేశారని చెబుతున్నారు.  ధాన్యం మొత్తం కొంటామని సీఎం, కొడాలి నాని చెప్పడం లేదు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. గుంటూరు జిల్లా కర్ఫ్యూ నీడలో ఉంటే ప్రధానితో మాత్రం బాగా చేశానని చెబుతున్నారు. మీరుంటున్న గుంటూరు జిల్లా నుంచి బయటకు వచ్చే దిక్కులేదు. వాస్తవాలు ఇలా ఉంటే అబద్ధాలు చెబుతున్నారు. వ్యవసాయ పంటలను ఏ విధంగా కొనుగోలు చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ధాన్యం రైతులను నిలువునా దోపిడీ చేసేస్తున్నారు. క్వింటాకు 1835 రూపాయిలు రావాల్సిన బియ్యానికి మీరు ఎంత ఇస్తున్నారు? ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడా లేవు. దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే కన్నబాబు ఏం చేస్తున్నారు? 8వ తరగతి చదివిన కొడాలి నాని ఏం చేయగలరు? 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క డాక్టర్ ఉన్నాడా? ఆరోగ్యశాఖ మంత్రిగా ఒక్క డాక్టర్ ను పెట్టుకోలేరా ? రివ్యూలు చేయడం సీఎంకు,  ఆరోగ్యశాఖ మంత్రికి చేతకాదు. ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు...కరోనా ఉధృతమవుతుంటే ఎన్నికలు పెట్టడానికి కనగరాజ్ ని తీసుకొస్తారా ? బుద్ది ఉందా? బాధ్యత ఉందా ? మీ ప్రభుత్వానికి సలహాల కోసం అఖిలపక్షాన్ని పిలవండి.. పాలన చేతకావడం లేదు కాబట్టి చేతులెత్తేయండి ..వీడియో కాన్ఫరెన్స్ లో అఖిలపక్షాన్ని తీసుకోండి....
SD
దేవినేని ఉమామహేశ్వర రావు
మాజీ మంత్రివర్యులు


Popular posts
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు:
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image