అద్దెల కోసం వేధిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి, జనసేన పార్టీ నాయకులు డిమాండ్
,ఎమ్మిగనూరు,మార్చి, 2 (అంతిమతీర్పు):-ఎమ్మిగనూరు పట్టణంలోని గురువారం ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మిగనూరు తాలూకా జనసేన పార్టీ నాయకులు బి.సీ. నాగరాజు, S. భాస్కర్, K. దామోదర్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతోమనభారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త హెల్త్ & వెల్త్, రూరల్ & హర్బన్, హోం డిపార్ట్మెంట్స్ ప్రజా ఆరోగ్య సంక్షేమ రీత్యా, కరోనా వైరస్ నిర్మూలన రీత్యా, ఒకరి నుండి ఒకరికి ఈ వ్యాధి సోకకుండా, వంటి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని మార్చి 20 నుండి ఏప్రిల్ 14 వరకు భారతదేశం మొత్తం 144 సెక్షన్ వంటి కఠినమైన ఆంక్షలు విధిస్తూ అటు ప్రజల దినసరి జీవన కూలీలకు, ఇటు వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాలకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఎంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అన్న విషయం జగమెరిగిన సత్యం, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఇంటి అద్దె కోసం, వర్తక వాణిజ్య రంగాలకు సంబంధించిన వారిని సముదాయాల అద్దె కోసం యజమానులు, గుత్తేదారు యాజమాన్యం వేధీంచడం సరైన నిర్ణయం కాదని, ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా ఇంటి, వర్తక వాణిజ్య సముదాయాలకు సంబంధించిన యజమానులు అద్దెలు చెల్లించాలని ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించినా కూడా మాకు అద్దెలు చెల్లించాల్సిందే అని వేధిస్తున్న వారిపై హోం శాఖ, ఇతరత్రా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాగేంద్ర, కలగట్ల రాజు, అంజి, ప్రభాకర్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.