సర్వే పల్లి రైతన్న కానుక  పంపిణీ చేస్తాం  :  ఎమ్మెల్యే. కాకాణి.    

సర్వే పల్లి రైతన్న కానుక  పంపిణీ చేస్తాం  :  ఎమ్మెల్యే. కాకాణి.                            


  సర్వే పల్లి నియోజకవర్గ పరిధిలో త్వరలో సర్వే పల్లి రైతన్నకానుక పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాణి స్పష్టం చేశారు. గురువారం మనుబోలు మండలం జట్ల కొండూరు లో కూరగాయలు పంపిణీ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలు తనపిలుపుమేరకు లాక్డౌన్ దృష్ట్యా రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవులకొరకు 800 టన్నుల బియ్యం సేకరించి పంపిణీ కీ సిద్ధం చేశామన్నారు. దీంతోపాటు పామాయిల్ ఒకలీటరు చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. కూరగాయలు పంపిణీ సర్వే పల్లిలో ప్రారంభమైందని దీనిని ఆదర్శంగా తీసుకుని జిల్లా. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం లా సాగుతుందన్నారు. ఈ కార్యాక్రమంకు సహకరిస్తున్న అన్నదాతల కు అభినందనలు తెలిపారు. అదేవిధంగా కొండూరు పంచాయతీ లో కూరగాయలు పంపీణీ చేసిన బాస్కర్ రెడ్డికి పోలీసులు కు వైద్యులు కు మాస్క్ లు గ్లౌస్లు పంపిణీ చేసిన ఎన్ కిరణ్ రెడ్డికి అభినుదనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలవైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.