ముఖ్యమంత్రి కి చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ

గౌ జగన్మోహన్ రెడ్డి గారికి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
అమరావతి,
విషయం: రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణ-విశాఖ మెడ్ టెక్ జోన్ లో భారీఎత్తున వెంటిలేటర్లు, రక్షణ ఉపకరణాల తయారీ-పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవడం-నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ-ఇసుక,గ్రావెల్,మట్టి మాఫియాకు అడ్డుకట్ట-వివిధ శాఖల మధ్య సమన్వయం, సరైన మార్గదర్శకత్వం. 
1) విశాఖ మెడ్ టెక్ జోన్ లో పూర్తి సామర్ధ్యంలో వెంటిలేటర్లు, రక్షణ ఉపకరణాల తయారీ: 
కరోనా మహమ్మారిపై ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్లు మన డాక్టర్లు, వైద్య-ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కాపాడటం ప్రభుత్వాలకు పెను సవాల్ గా మారింది. వారికి కావాల్సిన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ అందించడం ప్రభుత్వాల బాధ్యత.  ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం మెడ్ టెక్ జోన్ పిపిఈల తయారీకి ఒక కల్పతరువు కానుంది. 
దేశంలోనే మొట్టమొదటి మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీ పార్క్  గా విశాఖ మెడ్ టెక్ జోన్ ను నెలకొల్పడం జరిగింది. సూది నుంచి సీటి స్కాన్ యంత్రం దాకా అన్ని వైద్య పరికరాలు తయారు చేసేలా 100 సంస్థలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఆసుపత్రులకే కాదు మొత్తం దేశానికే కావాల్సిన వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లను ఇక్కడ తయారుచేసి పంపే సౌలభ్యం ఉంది. 2019 మే వరకు అనేక కంపెనీలతో మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీలో ముందున్న విశాఖ మెడ్ టెక్ జోన్ గత 11 నెలలుగా నిర్లక్ష్యానికి గురైంది.సిఈవోను మార్చడం, మళ్లీ ఆయననే తెచ్చుకోవడం ద్వారా చేసిన తప్పు దిద్దుకోవడం వంటి చర్యలతో నిర్వీర్యం అయ్యింది. 
గత ప్రభుత్వాలు నెలకొల్పారనే అక్కసుతో ప్రజోపయోగమైన ప్రాజెక్టులను మూసేయడం, ఆపేయడం సమాజానికి చేటు. ఇప్పటికే అన్నా కేంటిన్ల మూత వల్ల పేదలకు నాణ్యమైన ఆహారం రూ 5కే లభించే అవకాశం లేకుండా పోయింది. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజి) నిర్వీర్యం కావడం వల్ల ఇలాంటి ఆపత్కాలంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి దూరమైంది. విశాఖ మెడ్ టెక్ జోన్ ను కూడా వాటిలానే పూర్తిగా నిర్లక్ష్యంచేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేది. మన రాష్ట్రంలోనే ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు మొత్తం 30వేల మందికి కావాల్సిన పర్సనల్ ప్రొటెక్షన్ కేర్ అందుబాటులో లేదు. 
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి, కేంద్ర ప్రభుత్వమార్గదర్శకంలో పూర్తి స్థాయిలో మెడ్ టెక్ జోన్ ను గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రానికే కాకుండా దేశానికి అంతటికీ కావాల్సిన మెడికల్ ఎక్విప్ మెంట్, డాక్లర్లు, వైద్య సిబ్బందికి కావాల్సిన రక్షణ ఉపకరణాలు తయారీకి నడుం కట్టాలని సూచిస్తున్నాం. 
2)పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవడం: 
ఒకవైపు పొలాల్లో ధాన్యం, తోటల్లో పండ్లు కళ్లముందే మాగిపోవడం చూసి రాష్ట్రంలో రైతాంగం తల్లడిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో పాలకులు మీనమేషాలు లెక్కించడం భావ్యం కాదు. ప్రభుత్వమే ముందుకొచ్చి  కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఏర్పాటు చేసి, అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల ద్వారా రైతుల్లో భరోసా కల్పించాల్సిన సందర్భమిది. 
వరికోత యంత్రాల అద్దెలు పెరిగిపోయి, కోతలకు కూలీలు రాక, ఏం చేయాలో తోచక ధాన్యం రైతులు అల్లాడుతున్నారు. రబీలో 30లక్షల టన్నుల ధాన్యం కొనాల్సివుండగా ఖరీఫ్ ధాన్యం ఇంకా 30% రైతుల వద్దే ఉందని తెలుస్తోంది. 
రాయలసీమ, ప్రకాశం జిల్లాలలో సెరికల్చర్ రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో రైతుకు రూ 50వేల నుంచి రూ లక్షన్నర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఎండలో పట్టుగూళ్లు ఆరబెట్టడం వల్ల తరుగునష్టం తోపాటు, రవాణా లభించక, మార్కెట్ లేక సెరికల్చర్ రైతులు ఆవేదనలో ఉన్నారు. కొనుగోళ్లు లేక ఒక్క ప్రకాశం జిల్లాలోనే 78మిలియన్ కిలోల పొగాకు నిల్వలు పేరుకు పోయాయి. పొగాకు అమ్ముడుబోక, రంగుమారి, బరువు తగ్గి ధర కోల్పోయి, కొనేవారు లేక రైతాంగం నిరాశలో ఉన్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగం సర్వనాశనం అయ్యే దుస్థితి ఏర్పడింది.  చేపలు, రొయ్యలు చెరువుల్లోనే ఉన్నాయి, మేత అందుబాటులో లేదు, ప్రాసెసింగ్ యూనిట్లన్నీ మూతబడ్డాయి, రాబోయే 2నెలలు ఆక్వా ఉత్పత్తులను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు ఖిన్నులై ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఏ ఒక్కచోటా లభించడం లేదని రైతులే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీడ్ అందుబాటులోకి తేవడంతో పాటు ఆక్వా ఉత్పత్తులకు సరైన ధర రైతులకు లభించేలా పర్యవేక్షించాలి.అరటి ధర రూ 14వేల నుంచి రూ 2వేలకు పడిపోయింది. బొప్పాయి రూ 14వేల నుంచి 3వేలకు పడిపోయింది. మామిడి కాయలు కోసేందుకు కూలీలు దొరక్క, లారీలు లేక రవాణా స్థంభించి, మార్కెట్ మూతబడి, ధరలు పడిపోయి మామిడి తోటల రైతులు కుదేలయ్యారు. టమాటా కిలో రూ 2కూడా కొనేవాళ్లు లేక మదనపల్లి మార్కెట్ మూతబడి రైతుల్లో నిరాశ నెలకొంది. చీనీతోటల్లోనే కాయలు మాగి రాలిపోవడం చూసి చీనీ రైతులు కుదేలయ్యారు. కూలీల కొరత, రవాణా స్థంభించి, ధరపడిపోయి అన్నిందాలా నష్టం జరిగింది. పుచ్చ, కర్బూజ, ఇతర పండ్లు, పూల తోటల రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో హార్టీ కల్చర్ రైతాంగాన్ని ప్రభుత్వమే ముందుకొచ్చి ఆదుకోవాలి. 
3)నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ:
లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో వారికి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేక, ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 
ఈ విపత్కర పరిస్థితిని కూడా సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనతో కొందరు దళారులు, అక్రమ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ విక్రయాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ బ్లాక్ మార్కెట్ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలి. 
మొబైల్ రైతుబజార్ల ద్వారా  ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు చౌకధరలకు ఇళ్ల వద్దకే అందుబాటులోకి తేవాలి. కూరగాయలు, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆర్టీసి సిటి బస్సులు, పల్లె వెలుగు సర్వీసులను వినియోగించుకోవాలి. 
4)ఇసుక,గ్రావెల్,మట్టి మాఫియాకు అడ్డుకట్ట: 
కరోనా మహమ్మారిని ఎలా కట్టడి చేయాలా అని ప్రపంచ దేశాలన్నీ తలలు పగుల కొట్టుకుంటుంటే, మనరాష్ట్రంలో మాత్రం ఈ విపత్కర పరిస్థితిలో కూడా ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాల్లో మాఫియా మూకలు తలమునకలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం ప్రధాని లాక్ డౌన్ పిలుపునకు తూట్లు పొడవడమే. ఒకవైపు దేశం అంతా లాక్ డౌన్ అమలు అవుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ఇటువంటి దుశ్చర్యల ద్వారా లాక్ డౌన్ కు తూట్లు పొడవడం వల్ల కరోనా మహమ్మారి మరింత ఉధృతం అయ్యే ప్రమాదం ఉంది. 
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో వందల లారీల్లో గ్రావెల్ తరలిస్తున్నారు. కడప జిల్లా కమలాపురంలో గ్రామస్తులే వందలాది లారీల్లో ఇసుక తరలింపును అడ్డుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ద్విచక్ర వాహనాల్లో తిరిగే వారినే ఆపేస్తున్న అధికారులు, వందలాది లారీలు, ట్రాక్టర్లలో ఇసుక తరలింపు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించినట్లుగా చూశాం. ప్రకాశం జిల్లాలో  గతంలో నిర్మించిన చెక్ డ్యామ్ లు ధ్వంసం చేసి ఊరకుంటలు చదును చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం, ఇతర ప్రాంతాలలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్దంగా మెషీన్లతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. 
   ఒకవైపు భౌతికదూరం పాటించాలని చెబుతూ రీచ్ లలో ఇసుక లోడింగ్, అన్ లోడింగ్ కు, వందలాది లారీ డ్రైవర్లు, రవాణా సిబ్బందిని, వేలాది కూలీలను అనుమతించడం ప్రజారోగ్యానికే ప్రమాదకరం..
5)వివిధ శాఖల మధ్య సమన్వయం, సరైన మార్గదర్శకత్వం: 
ప్రస్తుత విపత్కర పరిస్థితిలో రాష్ట్రంలో పోలీసు, రెవిన్యూ, విపత్తు నిర్వహణ, వైద్య ఆరోగ్య మరియు సంబంధిత ఇతర శాఖల మధ్య సమన్వయం అత్యవసరం. సమన్వయ లోపం ఉంటే, కరోనా మహమ్మారిని కట్టడి చేయలేం, దాని వ్యాప్తిని నిరోధించలేం. 
పోలీసులకు ప్రజలు సహకరించాలి, అదే సమయంలో పోలీసులు కూడా సంయమనం పాటించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా జిల్లా కైకలూరు యువకుడు తిరుపతినుంచి స్వస్థలానికి వెళ్తూ, బాపట్లలో పోలీసులు కొట్టారనే ఆవేదనతో చెట్టుకు ఉరేసుకోవడం, పాలకొల్లు ఎల్ ఆర్ నగర్ లో టిఫిన్ బండి వద్ద తింటున్నవాళ్లను పోలీసులు తరమడంతో, భయపడి పరుగెత్తడంతో కుప్పకూలి ఒకరు మృతి చెందడం ఆవేదనకు గురిచేస్తున్నాయి. పోలీసులు, ప్రజల మధ్య మరింత సంయమనం పెరగాల్సిన అవసరాన్ని ఈ దుర్ఘటనలే తెలియ జేస్తున్నాయి.
-వీటన్నింటిని ఎప్పటికప్పుడు పరిశీలించి, జిల్లాలనుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి, ప్రపంచ, దేశ పరిణామాలను అధ్యయనం చేస్తూ, అన్నిశాఖల మధ్య సమన్వయం సాధించి, రాష్ట్రానికి సరైన మార్గదర్శకం చేయాలని, తద్వారా ప్రజారోగ్యానికి ఒక దృఢమైన రక్షణ కవచంలా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
(నారా చంద్రబాబు నాయుడు)
శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image