సర్వేపల్లి రైతన్న కానుక

తేది:11-04-2020


*నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష కుటుంబాలకు పంపిణీ చేయనున్న "సర్వేపల్లి రైతన్న కానుక" పేరిట బియ్యం, వంట నూనె పంపిణీ కార్యక్రమాన్ని గొలగమూడి లోని శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి సన్నిధిలో ఆవిష్కరించి, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పేదలకు పంపిణీ చేసిన టి.టి.డి. చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగారు, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగారు, గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ రావుగారు, కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిగారు, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్యగారు.*


*బియ్యం పంపిణీకి ధాన్యం అందించిన రైతులకు ముఖ్యఅతిధుల చేతులమీదుగా కృతజ్ఞతా పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.*


*స్క్రోలింగ్ పాయింట్స్:*


👉సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష కుటుంబాలకు 8,50,000కేజీల (850టన్నుల) బియ్యం 80 వేల లీటర్లు వంట నూనె పంపిణీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.


👉సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష కుటుంబాలకు బియ్యం, వంట నూనె పంపిణీ చేసే ఈ కార్యక్రమానికి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు భారీ వ్యయంతో పేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.


👉 రైతుల దాతృత్వంతో ఇప్పటికే 850 టన్నుల ధాన్యాన్ని సమకూర్చుకొని 500 టన్నుల బియ్యంతో సిద్ధంగా ఉన్నాం.


👉 రైతులు ఇంకా ధాన్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు, దాతలు కొంతమంది విరాళాలు అందజేశారు.


👉 వీటితోపాటు సొంత నిధులను వెచ్చించి సర్వేపల్లి నియోజకవర్గంలో 850 టన్నుల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాం.


👉 నియోజకవర్గ రైతుల స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున *"సర్వేపల్లి రైతన్న కానుక*"  పేరిట ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది.


👉 ధాన్యం అందించిన రైతులకు, విరాళాలు అందించిన దాతలకు, పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.