విరాళాలు సేకరించి సేవ ముసుగులో రాజకీయం చేస్తూ మంత్రికి ప్రచారం చేస్తున్న వర్తక, వ్యాపార యజమానులు మరియు పెద్దలు తీరు మార్చుకోవాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం అమ్మవారి ప్రసాదాన్ని కూడా దోచేస్తున్న వైసిపి నాయకులు
కృష్ణాజిల్లాలో నాలుగువేల N95 మాస్కులు దోచేసిన వైసిపి నాయకులు
విపత్కర సమయంలో ప్రభుత్వం చేసే సహాయమా లేక వైసిపి అభ్యర్థుల ప్రచార కార్యక్రమమా?
గణపతి రోడ్డులో గల జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ, సేవ ముసుగులో రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమో పశ్చిమ నియోజకవర్గంలోని వ్యాపారవేత్తలు, విద్యా సంస్థల యజమానులు ఆలోచన చేసుకోవాలని, విపత్కర సమయంలో ప్రజలకు అండగా ఉండాలని, 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు కానీ అవి సక్రమంగా పేదవారికి సేవ చేయడానికి ఉపయోగించక పోవడం దారుణమని, 10లక్షల రూపాయలు విరాళాలను మీరు నిజంగా సమాజానికి ఉపయోగపడేలాగా చెయ్యాలనుకుంటే ఆ డబ్బును పిఎం కేర్ గాని, సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించాలి లేదా 2000 పేద కుటుంబాలకు 500 రూపాయల చొప్పున పంపిణీ చేయాలి అలా కాదు అనుకుంటే రోజుకి రెండు వేల మందికి 12 రోజులపాటు మీరే అన్నప్రసాద వితరణ చేయాలి లేదా కరోనా నియంత్రణ కోసం నిరంతరం సేవలందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఇతర సిబ్బందికి మీరే మాస్కులు, గ్లౌస్ , ఇతర వైద్య పరికరాలు ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని అల చేసుంటే ప్రతి ఒక్కరు కీర్తించేవారన్నారు. అలా కాకుండా 11 వేల మందికి 5 కేజీల కూరగాయలు పంపిణి చేస్తామని చెప్పి అందులో కేవలం 50 నుంచి 55 రూపాయల కూరగాయలు అందజేసి విరాళాలు పక్కదారి పట్టించడం ఈ సమయంలో సమంజసం కాదన్నారు. మిగిలిన నాలుగున్నర లక్షలను వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయాలని కృష్ణవేణి క్లాత్ మార్కెట్ యజమానులకు మరియు ఐరన్ యార్డ్ వర్తకులకు మహేష్ విజ్ఞప్తి చేశారు. మంచి మనసుతో సేవ చేయాలనుకుంటే మీరు ప్రజల్లోకి వెళ్లి సేవ చేయాలి అందుకు సమాజంలో ప్రతిఒక్కరు సహకరిస్తారు కాని ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ మంత్రికి అనుకూలంగా ప్రచారం చేయడం సేవ ముసుగులో రాజకీయం చేయడం చాలా దారుణం అన్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారస్తులు విరాళాలను DD,CHEQUE రూపంలో గాని, లేదా నేరుగా బ్యాంకులో డిపాజిట్ చేయాలని, నగదు రూపంలో మాత్రం ఎవరికీ విరాళాలు ఇవ్వొద్దని మహేష్ విజ్ఞప్తి చేసారు.
2)అమ్మవారి దేవస్థానంలో కరోనా విపత్కర సమయం మొదటి రోజు నుండి ప్రతిరోజు 4 వేల ప్యాకెట్ల అన్నప్రసాద వితరణ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు నేటి వరకు ఈ పన్నెండు రోజుల్లో ఆలయ ఈవో గాని, దేవస్థానం సిబ్బంది గాని, పాలకమండలి సభ్యులుగాని ఒక్కటంటే ఒక్క ప్యాకెట్ కూడా అసరా లేని వ్యక్తులకు, భవన నిర్మాణ కార్మికులకు, పేద సామాజిక వర్గాలకు, పంపిణీ చేసిన దాఖలాలు లేవని, ప్రతిరోజు ఈ నాలుగు వేల ప్యాకెట్లు వైసిపి స్థానిక అభ్యర్థులు వారి డివిజన్లో పంపిణి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు, ఇది ఎంతవరకు సమంజసమో ఈఓ గారు సమాధానం చెప్పాలన్నారు. ఆలయ సిబ్బంది పంపిణీ చేస్తే ప్రసాదం అవుతుంది గాని, వైసిపి నాయకులు పంపిణీ చేస్తే అది పాపం అవుతుందని అన్నారు. కాంట్రాక్ట్ లో అక్రమాలు ఉన్న విషయం తదుపరి మాట్లాడుకోవచ్చు గాని ప్రసాదాల వితరణలో కూడా అక్రమాలు ఏంటి ఈఓ గారు అని ప్రశ్నించారు. నేటి నుంచి 4 వేల అన్నప్రసాద ప్యాకెట్లను ఆసరా లేని వారికి, పేదవారికి, భవన నిర్మాణ కార్మికులకు సక్రమంగా పంపిణీ చెయ్యకపోతే అమ్మవారి మరియు భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హితవు పలికారు.
3)ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి చెందిన 4000 వేల N95 మస్కులను కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులు దోచేస్తే ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గానీ, అధికారులు గానీ స్పందించకపోవడం దారుణమన్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఎందుకు ఈ విషయంపై స్పందించలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు అండగా నిలుస్తున్న వైద్య సిబ్బంది కి అండగా నిలవాల్సిన విపత్కర సమయంలో సమాజం పై బాధ్యత లేకుండా వ్యక్తిగత భద్రత చూసుకుంటున్న అధికార వైసీపీ పార్టీనేతలు ఈ విదంగా ప్రవర్తించడం దారుణం అన్నారు.
4)1000 రూపాయల నగదు పంపిణీ వద్ద రేషన్ దుకాణాల వద్ద పని చెయ్యని పెన్షన్ల వద్ద పనిచేసే వాలెంటరీ వ్యవస్థను పక్కనపెట్టి రేషన్ దుకాణాల వద్ద వైసిపి స్థానిక సంస్థల అభ్యర్థులు ప్రచారం కోసం ఇష్టానుసారంగా ఫోటోలు దిగడం, ఇలాంటి విపత్కర సమయంలో దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, ఇది రాష్ట్ర ప్రభుత్వ సాయమా లేక వైసిపి అభ్యర్థుల ప్రచార కార్యక్రమమో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వైసిపి రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు.