నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం, జిల్లాల్లో కూడా ల్యాబులు సిద్ధం అవుతున్నాయి : ముఖ్యమంత్రి

*28–04–2020*
*అమరావతి*


*కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


అమరావతి:
*కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*
మంత్రి మోపిదేవి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్‌ హాజరు
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరాలు అందించిన వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి


గడచిన 24 గంటల్లో 82 కేసులు నమోదయ్యాయని తెలిపిన అధికారులు


ఇప్పటివరకూ 80,334 పరీక్షలు చేయించామన్న అధికారులు


ప్రతి 10 లక్షల జనాభాకు 1504 చొప్పున పరీక్షలు చేయిస్తున్నామని తెలిపిన అధికారులు


దేశంలోనే అధిక సగటుతో పరీక్షలు చేసి ప్రథమ స్థానంలో ఉన్నామన్న అధికారులు


పాజిటివ్‌ కేసుల సగటు దేశం మొత్తం 4.13 శాతం అయితే, ఏపీలో 1.57శాతం అని, అలాగే డెత్‌రేటు దేశం మొత్తం 3.19 శాతం అయితే ఏపీలో 2.46 శాతం అని వెల్లడించిన అధికారులు∙


ఈకేసులన్నీ కూడా కంటైన్‌మెంట్‌ జోన్లనుంచే వస్తున్నాయన్న అధికారులు


కంటైన్‌మెంట్‌ ఆపరేషన్స్‌లో భాగంగా అక్కడ ముమ్మరంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని, విస్తృతస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపిన అధికారులు


శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ల్యాబులు సిద్ధం అవుతున్నాయి:


విజయనగరం, ప.గో.జిల్లాల్లో ల్యాబుల ఏర్పాటుపైనకూడా దృష్టిపెడుతున్నాం:


తద్వారా ప్రతి జిల్లాలో కూడా ల్యాబులు ఉన్నట్టేనని వెల్లడించిన అధికారులు:


మైల్డ్‌ సింప్టమ్స్‌ ఉన్నవారు హోంఐసోలేషన్‌ కోరుకుంటే అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిందన్న అధికారులు


టెలిమెడిసిన్‌లో భాగంగా వైద్యం తీసుకుంటున్నవారికి మందులు కూడా సరఫరాచేసే విధానం సమర్థవంతంగా ఉండాలన్న సీఎం
దీనికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్న అధికారులు


*వ్యవసాయం అనుబంధ రంగాలపై సమీక్ష:*


*రాష్ట్రంలోని వివిధ పంటల మార్కెటింగ్, ధరలు అంశాలపై సీఎం సమీక్ష*


మొక్కజొన్న, శెనగ, ధాన్యం కొనుగోళ్లపై ఆరా


బత్తాయి, అరటి రైతుల సమస్యలపైనా చర్చ


నిరంతరం పర్యవేక్షించి అవసరమైన చోట మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుంటోందన్న అధికారులు


బయట రాష్ట్రాల్లో మార్కెట్లు తెరిచారా? లేదా? మన రాష్ట్రం నుంచి అక్కడకు రవాణా అవుతుందా? లేదా? అక్కడ విక్రయాలు ఎలా ఉన్నాయి? వాటి ధరలతో ప్రతిరోజూ సమీక్షా సమావేశానికి వివరాలతో రావాలని సీఎం ఆదేశం


రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులన్నీ బయట రాష్ట్రాలకు ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుందన్న సీఎం, దీనిపై పత్యేక దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి


అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా తల్లి రొయ్యలు, రొయ్యపిల్లల కొరతపై సమావేశంలో చర్చ


తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవికి ఆదేశం


సీఎం ఆదేశాల మేరకు అగ్రి ప్రాసెసింగ్‌లో సమస్యలు చాలా వరకు తొలగిపోయిందన్న అధికారులు


ఫాంగేట్‌ పద్ధతిలో ధాన్యం కొనుగోలు స్టెబిలైజ్‌ అవుతుందన్న అధికారులు


ఎక్కడ రైతులకు ఇబ్బందులు వచ్చినా.. అక్కడ జోక్యంచేసుకుని రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని మరోసారి స్పష్టంచేసిన సీఎం


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం
కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ  గ్రూప్
Image