రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్

అమరావతి    ఏప్రిల్ 24,(అంతిమ తీర్పు):జాతీయ స్థాయిలో పది రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రులు, అధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ వీడియో కాన్ఫెరెన్స్ని నిర్వహించారు. తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ఫ్ సిఇఓ పి.రాజాబాబు కరోనా విపత్తు నేపథ్యంలో గ్రామీణ పేదలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, జీవనోపాధికి అమలు చేస్తున్న కార్యక్రమాలపై కేంద్రమంత్రి సమీక్ష.
*రాష్ట్రంలో గ్రామీణ పేదలకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం, స్వయం సహాయక బృందాలకు అందిస్తున్న చేయూత, రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలులోకి తీసుకువచ్చిన సున్నావడ్డీ పథకం కింద వడ్డీ రాయితీలపై కేంద్ర మంత్రికి వివరించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.రాష్ట్రంలోని 8.78 లక్షల పొదుపు సంఘాలకు ఏడాదికి రూ.1400 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించామని, దీనివల్ల 90.37 లక్షల మంది మహిళలకు మేలు జరిగిందని వివరించిన మంత్రి పెద్దిరెడ్డి.
*రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం 13 జిల్లాల్లోని వెనుకబడిన 6 జిల్లాలకే ఏడుశాతం వడ్డీతో బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి.మిగిలిన ఏడు జిల్లాల్లో బ్యాంకుల సాధారణ వడ్డీ అంటే 13 శాతంకు పైగా వడ్డీని వసూలు చేస్తున్నాయి.
ఈ జిల్లాల్లో ఏడుశాతం కన్నా ఎక్కువ వున్న వడ్డీని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సమానంగా భరించాలని నిబంధనలు వున్నాయి. దానికి సరిపడే విధంగా కేంద్రం నిధులను ఇవ్వాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.


*దీనిపై ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారని గుర్తు చేసిన మంత్రి పెద్దిరెడ్డి.
 *నేషన్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) నిధుల నుంచి వడ్డీరాయితీకి నిధులను వాడుకోవాలని సూచించిన కేంద్రమంత్రి.అయితే ఎన్ఆర్ఎల్ఎం కింద రాష్ట్రానికి గరిష్టంగా ఏడాదికి సుమారు రూ.120 కోట్ల వరకు మాత్రమే అందుతున్నాయని, వడ్డీరాయితీ కోసం ఖర్చు చేస్తున్న నిధుల కన్నా ఇది చాలా తక్కువని గుర్తు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.


ప్రస్తుతం ఎపిలో అమలు చేస్తున్న వడ్డీరాయితీలో ఏడు జిల్లాలకే దాదాపు అయిదు వందల కోట్ల వరకు కేటాయిస్తున్నామని వివరించిన మంత్రి పెద్దిరెడ్డి.


రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలకు వడ్డీరాయితీ వల్ల ఆర్థిక చేయూత లభిస్తుందని, దానికి కేంద్రం నుంచి కూడా సహాయం అందించాలని విజ్ఞప్తి.*


దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రంమంత్రి, కేంద్రప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ.


 *రాష్ట్రంలో కరోనా విపత్తు నేపథ్యంలో స్వయం సహాయక బృందాలతో 16 కోట్ల మాస్క్ లు తయారు చేయించడం ద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*


దానితో పాటు శానిటైజర్లు, పిపిఐ కిట్ లను కూడా తయారు చేయిస్తున్నాం.


 రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 58 లక్షల మందికి నెలకు 1395.79 కోట్లను పంపిణీ చేశాం. 


 దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షనర్లకు వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ మొత్తాలను పంపి, స్వయంగా వారి చేతికి అందిస్తున్నాం. కరోనా నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అర్హులైన పేదలకు వెయ్యి రూపాయల సాయం కింద ఈ నెల నాలుగో తేదీన రూ.1343 కోట్ల రూపాయలను అందించింది. 
వైఎస్ఆర్ బీమా పథకం కింద కరోనా సమయంలోనూ 5545 మందిని రిజిస్ట్రర్ చేయించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 37 కోట్ల రూపాయలను బీమా మొత్తంగా చెల్లించడం జరిగింది.


)లాక్ డౌన్ సమయంలో స్త్రీనిధి రుణాల కింద సభ్యులు చెల్లించాల్సిన రూ.350 కోట్లకు రాష్ట్రప్రభుత్వం మారటోరియం ప్రకటించింది.  కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను, సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ లకు తెలియచేయడం ద్వారా వాటిని పూర్తిగా అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోంది. 
   ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అందుకు అవసరమైన అన్ని నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల రక్షణ కోసం ప్రతి వ్యక్తికి మూడు మాస్క్ లను ఉచితంగా అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మాస్క్ ల తయారీ బాధ్యతలను స్వయం సహాయక బృందాలకు అప్పగించింది. లాక్ డౌన్ సమయంలో ఉపాధికి దూరమైన స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పనులతో అటు ఉపాధిని కల్పించడంతో పాటు ఇటు ప్రజల ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే మాస్క్ లను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు యాబై లక్షల మాస్క్ లను తయారు చేసి ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. 
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేటాయించిన మొత్తం పనుల్లో 62శాతం వ్యక్తిగత పనులుకు నిధులను కేటాయిస్తున్నాం. ఇప్పటి వరకు 77 శాతం నిధులను సహజ వనరుల నిర్వహణ (ఎన్ఆర్ఎం) పనులకు ఖర్చు చేశాం.  మహాత్మాగాంధి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపడుతున్న కూలీల బృందాలకు కరోనా విపత్తు నేపథ్యంలో చేతులను ఎక్కువసార్లు శుభ్రపరుచుకునేందుకు రెండు సబ్బులు, డెటాల్ లిక్విడ్ లను అందచేస్తున్నాం. ఆరోగ్యపరమైన అన్ని నిబంధనలను పాటించడం, వాటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ ను రూపొందించాం. పనులు జరిగే ప్రాంతం నుంచి జియో కోఆర్డినేషన్ తో ఫోటోలను కూడా ఈ యాప్ లో అప్ లోడ్ జరిగేలా ఆదేశించాం. ఎక్కడా కరోనా నియంత్రణ నిబంధనల ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షిస్తున్నాం.ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు ఈ నెల 21వ తేదీ వరకు చెల్లించాలసిన వేతనాలను అందచేశాం. అలాగే పెండింగ్ లో వున్న వేతన బకాయిల బిల్లులను కూడా ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.కేంద్రప్రభుత్వం కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు నిర్ధేశించిన అన్ని నిబంధనలను రాష్ట్రప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తోంది. దీనితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు జీవనోపాధి కల్పించడంపై కూడా దృష్టి సారించింది.పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమార్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ఫ్ సిఇఓ పి.రాజాబాబు తదితరులు పాల్గొన్నారు