కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ  గ్రూప్


*కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ  గ్రూప్ విరాళము*గుంటూరు జిల్లా*
పెదకాకాని  కారోన వైరస్ నియంత్రణ చర్యలు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి   దక్కన్ టూబాకోకంపెనీ  గ్రూప్   25 లక్షల రూపాయలు విరాళం అందించారు. 
  సోమవారం ఉదయం పెదకాకాని లోని దక్కన్ టూబాకోకంపెనీ  గ్రూప్  డైరెక్టర్  షఫీ ఖాన్  గారు పొన్నూరు ఎమ్మెల్యే శ్రీ కిలారి వెంకట రోశయ్య  గారికి ఈ విరాళం చెక్కు అందజేశారు 
ఈ సందర్భంగా షఫీ ఖాన్ గారు మాట్లాడుతూ కారోన వైరస్    కారణంగా దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం సూచించిన విధంగా సలహాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు ప్రతి ఒక్కరు లాక్ డౌన్ ను  పాటించాలని ఆయన పిలుపునిచ్చారు, కారోన నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల కోసం తమవంతు సహాయం చేసినట్లు  షఫీ ఖాన్    తెలిపారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య  గారు మాట్లాడుతూ  కారోన కట్టడి కి ప్రజలు అందరూ సహకరించాలని ఆయన అన్నారు  లాక్ డౌన్   పాటించాలని ఆయన సూచించారు   కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వానికి  దక్కన్ టూబాకోకంపెనీ  గ్రూప్ విరాళం  అందించడాని  ఆయన అభినందించారు ప్రతి ఒక్కరు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తమ వంతు సహాయం అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమేష్ నాయుడు గారు C.I  శోభన్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు.  మనోలేఖ, న్యూస్ డెస్క్,