ప్రభుత్వ మద్యం దుకాణంలో తనిఖీలు

ప్రభుత్వ మద్యం దుకాణంలో తనిఖీలు
జ్విజయవాడ : బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మంగళవారం ఉదయం అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడి స్టాక్ రికార్డులను అధికారుల బృందం పరిశీలించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పీయూష్ కుమార్, కార్తికేయ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఎక్సైజు శాఖ డిప్యూటీ కమిషనర్ మురళీధర్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పీయూష్ కుమార్ మాట్లాడుతూ మద్యం షాపులలో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుందని, లాక్ డౌన్ సమయంలో అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేశామని తెలిపారు. ఈ తనిఖీలలో లాక్‌డౌన్ అమలుకు ముందు కొనుగోలు చేసిన మద్యం బాటిల్స్, ప్రస్తుతం షాపులో ఉన్న మద్యం నిల్వల లెక్కలు తీస్తున్నామని ఆయన చెప్పారు. తేడాలు వస్తే అక్రమంగా మద్యం విక్రయాలు చేసినట్లుగా భావించి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు ఎంత పకడ్భందీగా నిబంధనలు అమలు చేసినప్పటికీ కొన్ని చోట్ల మద్యం విక్రయాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బార్‌‌లలో కూడా సరుకు పక్కదారి పట్టినట్లు తమ దృష్టికి‌ వచ్చిందన్నారు. స్టాకు జాబితా ఆధారంగా  తనిఖీలు చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని పీయూష్ కుమార్ స్పష్టం చేశారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image