ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తు భయభ్రాంతులకు గురిచేయద్దు : వర్ల రామయ్య 

వర్ల రామయ్య విలేకరుల సమావేశ వివరాలు.


10-4-2020. 
ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తు భయభ్రాంతులకు గురిచేయద్దు : వర్ల రామయ్య 
                  ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాడుతున్న డాక్టర్ల సస్పెన్షన్ ను తొలగించాలి 
కరోనా కట్టడిలో ఫ్రంట్ వారియర్స్ కు రక్షణ పరికరాలు కల్పించాలి  
ఆయుధాలు లేకుండా కరోనాపై యుద్ధమంటే ఆశామాషీ కాదని జగన్ తెలుసుకోవాలి 
మెడికేషన్ మాస్కులు, రక్షణ గౌనులు, గ్లౌజెస్ సరఫరా చేసి వైద్యులకు మనోధైర్యం కలిగించండి   
దాతలు ఇస్తున్న విరాళాలు ఏమవుతునాయి?
సాక్షికి కోట్లలో దోచిపెట్టడానికి ఇస్తున్న  ప్రకటనలు ఆపుచేయండి 
అధికార్లు చెప్పింది వినకుండా ప్రజల్లోకి వచ్చి జగన్ వాస్తవాలు తెలుసుకోండి   
వైకాపా ప్రభుత్వం ఆసుపత్రుల్లో కరోనా కట్టడికి సమకూర్చాల్సిన సదుపాయాలు సరిగ్గా లేవని చెప్పిన ఉద్యోగులను సస్పెండ్ చేసే కార్యక్రమం కొనసాగిస్తుండటం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.  "అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్లు" ఉందీ సీఎం జగన్ పరిస్థితి అని వర్ల  ఎద్దేవా చేశారు..  ఇక్కడ జగన్  తప్పులు దిద్దుకోవడం లేదు చిన్న తప్పులు చేసిన వారిని శిక్షించడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు . ``కరోనా మహమ్మారిని ఆయా రాష్ట్రాలు, దేశాల నుంచి పారద్రోలాలని  నేతలంతా ప్రయత్నిస్తున్నారు..ఏపీలో మాత్రం కరోనాను పారదోలే  ప్రక్రియలో పాల్గొనే డాక్టర్లు,మెడికల్, శానిటరీ సిబ్బంది, ఎగ్జిక్యూటీవ్స్ పోలీసులు, రెవిన్యూ ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు, పదోన్నతలు, ఇంక్రిమెంట్లు, బోనస్ లు ఇచ్చి  బాధ్యతలను గుర్తు చేయడానికి బదులు ఏపీలో సస్పెన్షన్లకు గురి చేస్తున్నారు. అయినదానికీ కానిదానికీ ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తు భయభ్రాంతులను చేస్తున్నారు.  కరోనాపై సీఎంకు పూర్తి అవగాహన ఉన్నట్లు కనపడటం లేదు.  కరోనా కట్టడిలో ఉత్తేజపరచి కార్యోన్ముఖులను చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. నర్సీపట్నంలో ప్రభుత్వ డాక్టరు సుధాకర్ కరోనా మహమ్మారి తీవ్రత చెప్పారు. విదేశాల్లోనూ కరోనాకు చికిత్స చేస్తున్న వైద్యులు కూడా చనిపోయిన దాఖలాలున్నాయి. మాస్కులు,ప్రొటెక్టీవ్ కిట్స్ ఇవ్వమని అడగడం తప్పా.కరోనాపై యుద్ధం చేయడానికి కావాల్సిన ఆయుధాలు మెడికేషన్ మాస్కులు, రక్షణ గౌనులు, గ్లౌజెస్  అడిగినందుకు నర్సీపట్నంలో డాక్టరును   సస్పెండ్ చేశారు. ఈ సమయంలో ఎవరైనా చేస్తారా.  ఆ ఎనస్తీషియన్ స్థానంలో ఎవరినైనా నియమించారా? ఆ ఖాళీ భర్తీ చేయకుండా కక్ష తీర్చుకోవడంతో వైద్య బృందాలన్నీ ఉలిక్కిపడ్డాయి. నగరి కమిషనర్ వెంకటరామిరెడ్డి ట్రెజరీ సీజ్ చేశారని, తట్ట బ్లీచింగ్ వేయడానికి  నిధులు మంజూరు చేయలేదన్నందుకు సస్పెండ్ చేశారు. "అమ్మ ఇవ్వదూ అడుక్కుతిననివ్వదు"అన్నట్లుగా ఉందీ వైకాపా ప్రభుత్వ తీరు. అనంతలో జూడాలు వైద్యం చేయలేమని అంటుంటే సిగ్గుతో ప్రభుత్వం తలదించుకోవాలి. 151 సీట్లు ఇచ్చి ప్రజలు ముఖ్యమంత్రిని చేసినందుకా ఈ శిక్ష. ఎప్పుడు ఎవరు సస్పెండ్ అవుతారోనని డాక్టర్లు భయపడుతున్నారు.  డాక్టర్లంతా అభద్రతా భావంలో ఉన్నారు. సొంత పత్రిక సాక్షికి ఏభయికోట్లు ప్రకటనలకివ్వడానికి డబ్బులెలా వచ్చాయి. డాక్టర్లకు సర్జికల్  మాస్క్ లు ఇవ్వడానికి దాతలిచ్చిన  కోట్లాది విరాళాలు ఏమయ్యాయి. కోటి మాస్కులు కొని డాక్టర్లకు సరఫరా చేయండి. జగన్ ఇల్లు కదలకుండా సాక్షి 
పత్రికకు ప్రకటనలు ఇస్తూ కూర్చున్నారు. ఇలా.అయితే కరోనా నుంచి ప్రజలను రక్షించడం కష్టం.  ప్రభుత్వ తప్పులను ఎంచిన ప్రతిపక్షనేతలను  నోటికొచ్చినట్లు తిట్టడం సబబు కాదు. నెల్లూరు ఎమ్మెల్యే.ప్రసన్న కుమార్ రెడ్డి సిగ్గుమాలిన బూతులు తిట్టడం సభ్యతగా లేదు.  చంద్రబాబును తిడుతుంటే     జగన్ నవ్వుకుంటారు . జగన్ నుంచే స్క్రిఫ్ట్ వెళుతోంది. సీఎంవో నుంచే వెళుతోంది.. ప్రసన్న కుమార్ రెడ్డి మనిషా.ఆయన తల్లిగారు జోక్యం చేసుకుని కుమారుడికి బుద్ధి చెప్పాలి. అతని తండ్రి వయసున్న నాయకుడుని ఇష్టానుసారం తిడుతుంటే ఊరుకుంటారా. ఫెనాయిల్, మాస్కులు అడిగితే సస్పెండ్ చేస్తారా.. సైన్యానికి తిండి తిప్పలూ లేకపోవడంతో హిట్లర్  పై అతని సైన్యం తిరుగుబాటు చేసింది . కరోనాపై యుద్ధం చేయడానికి ఆయుధాలు ఇవ్వకుండా  డాక్టర్లు ఎలా పోరాటం చేస్తారు. జగన్ బయటకు రారు. రైతు బజారుకు వచ్చి పరిశీలించండి.  ఇతర రాష్ట్రాల సీఎంలు జగన్ తీరు చూస్తే నవ్వుతారు. ప్రీ రికార్డు చేసి పాత్రికేయులను ఎదుర్కోలేక రికార్డు పంపిస్తారా? జగన్ దాక్కుంటున్నాడు. పాత్రికేయులతో మాట్లాడి ప్రభుత్వం ఏంచేయాలో చెప్పమని కోరాలి. పారాసిటమాల్ అంటే ప్రపంచమంతా నవ్వారు.  నష్టపోయేది రాష్ట్రప్రజలు మహారాష్ట్ర అందరికీ  రక్షణ కిట్స్ ఇచ్చారు. పోలీసులకు భోజనం ఇచ్చిన దాఖలాలు లేవు. నియంతలనుకున్న హిట్లర్, ముస్సోరిలు మట్టికొట్టుకుపోయారు. ప్రభుత్వ విధానంపై నోరెత్తితే సస్పేండ్ చేయడమేమిటి కరోనా  వ్యాధి సోకి డాక్టరుపోతే మరో డాక్టరు ను  తేలేరు.. జగన్ కక్ష కార్పణ్యాలతో  ఫ్యాక్షనిస్టు పాలన సాగిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా పాలించకుండా అడ్డుపడుతున్నారు. ఎస్ ఈ సీ రమేష్ కుమార్ కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను  కాపాడారని ఇగో హర్ట్ అయి జగన్ పగబట్టారు.  రమేష్ కుమార్ ను తీసేయడం న్యాయమా, ధర్మమా .    తొలగించాలని  ఆర్డినెన్స్ జీవో సిద్ధం చేస్తారా. మంచి చేసిన వారిని తొలగిస్తారా. రమేష్ మంచి చేశారని వైకాపా నేతలు సైతం అంటున్నారు.   ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ. 77 వేల కోట్లు ఏమయ్యాయి..బడా కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ప్రజా ఆరోగ్యం పట్టించుకోరా? ఏ2 డాక్టర్లకు ఇవ్వల్సిన ఎన్ 95 మాస్క్ తగిలించుకుని తిరుగుతున్నాడు. విజయవాడ లో  జగన్  తిరిగి ప్రజలకు నమ్మకం కలిగిచాలి. సుధాకర్ సస్పెషన్, నగరి కమిషనర్ ల   సస్పెన్షన్లను రద్దు చేయండి. అదిగోపులి ఇదిగో తోక అని అధికార్లు అనకుండా వాస్తవాలు చెప్పాలి. జగన్  ప్రాథమిక హక్కును నలిపేస్తున్నారు. ప్రభుత్వ బాధ్యతతో బ్ఫ్రంట్ వారియర్స్ ముఖ్యంగా డాక్టర్లుకు  అన్నీ సమకూర్చాలి. వైద్య ఆరోగ్యశాఖతో మాట్లాడి కిట్స్ ఇవ్వండి. డాక్టర్లకు కరోనా సోకే ప్రమాదం నుంచి కాపాడండి.జూడాల ఆవేదన వింటుంటే కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతున్నాయి.  ప్రస్తుత మన శత్రువు కరోనాను తుదముట్టించడానికి అహంభావం పక్కనపెట్టండి.  ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది సరిదిద్ఫుకోవాలి. సాక్షికి.ప్రకటనలకు కోట్లు ఖర్చు చేయకుండా కరోనా కట్టడికి నిధులు సమకూర్చండి. ప్రజారోగ్యానికు ముప్పు కలిగించకుండా డాక్టర్లకు మనోధైర్యం కలిగించండి.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image