భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కరోనా నివారణకు జాగ్రతలు పాటిద్దాం :మండ్ల సురేష్ బాబు,

మన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కరోనా నివారణకు జాగ్రతలు పాటిద్దాం


*చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైయస్ఆర్ కాంగ్రెస్ యువనేత మండ్ల సురేష్ బాబు,


*జల వనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ పిలుపుతో శానిటేషన్ కు శ్రీకారం*



*చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న 6 వ రోజు శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోటరి అధ్యక్షులు ధశరద రామిరెడ్డి జన విజాన వేదిక అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద.


*మన భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకుని కరోనా నివారణకు జాగ్రతలు పాటించి మన జీవితాలను మనమే కాపదుకుంధామని చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వైయస్ అర్ కాంగ్రెస్ యువనేత మండ్ల సురేష్ బాబు,అధ్యక్షులు గుండాల ఆది నారయణ లు అన్నారు.చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న 7వ రోజు శానిటేషన్ కార్యక్రమాన్ని గురువారం గూడూరు పట్టణం లోని సొసైటీ నారాయణమ్మ దేవస్థానం వద్ద నుంచి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానవత స్వచ్చంధ సంస్థ అధ్యక్షులు,రోటరీ క్లబ్ ప్రతినిధులు దశరథరామిరెడ్డి,జనవిజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా శానిటేషన్ వాహనాన్ని ప్రారంభించారు. చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైయస్ఆర్ కాంగ్రెస్ యువనేత మండ్ల సురేష్ బాబు,జన విజాన వేదిక అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్‍ మాట్లాడుతు చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా శానిటేషన్ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతోందన్నారు.రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పొలుబోయిన అనీల్ కుమార్ యాదవ్,వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఎన్నో విపత్కర పరిస్థితులను భారత దేశ ప్రజలు ఎదుర్కొన్నారన్నారు.దేశంలో కలరా,ప్లేగు,ఇతర ఎన్నో ప్రమాద కర వ్యాధులను తట్టుకుని నిలబదిందన్నారు.కరోనా ను కూడా కలిసికట్టుగా నిలబడి తరిమికొడదమన్నారు.గూడూరులో కరోనా పాజిటివ్ కేసు రావడం దురదృష్టకరమన్నారు.కరోనా దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తుంది అని అన్నారు.ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని లేకుంటే కరోనా వైరస్ బారిన పడక తప్పదని అన్నారు.చేగువేరా ఫౌండేషన్ పట్టణ ప్రజలకు అండగా నిలవడం విశేషం అన్నారు.దశరథ రామి రెడ్డి మాట్లాడుతూ కష్ట కాలంలో స్వచ్చంధ సంస్థలు ప్రజలకు అండగా నిలవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్,మధు రెడ్డి,నరేష్  రెడ్డి,అన్సర్ భాష,వినోద్,చేగువేరా పైలట్ టీమ్ పాల్గొన్నారు.*