వైయస్సార్‌ నిర్మాణ్‌ పోర్టల్‌ ఉపయోగాలు

*08–04–2020*
*అమరావతి.*


*ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ నిర్మాణ్, ఏపి ఇండస్ట్రీస్‌ కోవిడ్‌ –19 రెస్పాన్స్‌ పోర్టల్స్‌ను ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*వైయస్సార్‌ నిర్మాణ్‌ పోర్టల్‌ ఉపయోగాలు* 


పోలవరంతో నిర్మాణపనులు, ప్రభుత్వ గృహనిర్మాణంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులకు ఏ  పరిమాణంలో సిమెంటు కావాలో ఈ వైయస్సార్‌ నిర్మాణ్‌ యాప్‌ ద్వారా ఇండెంట్ చేసుకునే వెసులుబాటు.


వివిధ సిమెంటు తయారీ కంపెనీలు మరియు వివిధ ప్రభుత్వ శాఖలకు నడుమ సమన్వయం చేయడమే ఈ యాప్‌ లక్ష్యం. తద్వారా వివిధ పనులు ఆలస్యం కాకుండా ముందుకు సాగడానికి ఆస్కారం మరియు ప్రభుత్వ ధనం ఆదా.


సీఎఫ్‌ఎంఎస్‌కు వైయస్సార్‌ నిర్మాణ్‌ పోర్టల్‌ను అనుసంధానం చేయడం వల్ల సరఫరాదార్లకు ఎలాంటి ఆలస్యం లేకుండానే ఆన్‌లైన్‌ ద్వారా వారి పేమెంట్స్‌ చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 


*ఏపి ఇండస్ట్రీస్‌ కోవిడ్‌ –19 రెస్పాన్స్‌ పోర్టల్‌*
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎంఎస్‌ఎంఈ కంపెనీలు, సరఫరాదారులు ఈ పోర్టల్‌లో తమ వివరాలు నమోదుచేసుకోవాలి. 


కోవిడ్‌ –19 మెడికల్‌ రిలేటెడ్‌ ఐటెంలు, మాస్క్‌లు, శానిటైజర్స్, బెడ్స్, బెడ్‌ రోల్స్‌ వంటి వైద్య పరమైన సామాగ్రి అమ్మేవారు, కొనేవాళ్లు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. 
దీని వల్ల ఎవరి దగ్గరి ఎలాంటి వైద్యపరమైన మరియు ఇతర సంబంధిత ఉత్పత్తులున్నాయన్న వివరాలతోపాటు అమ్మేవాళ్లు, కొనేవాళ్లను ఒకే ప్లాట్‌ఫాంపైకి వచ్చే వెసులుబాటు. 
ఇది డెస్క్‌టాప్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా అందరూ వాడుకోవచ్చు. అవసరమైన సామగ్రి కొనుగోలు చేయుటకు సౌలభ్యంగా ఉంటుంది.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు