వైసీపీ నాయకుల దాతృత్వం

*వైసీపీ నాయకుల దాతృత్వం*
కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యం లో రెక్కాడితే గాని డొక్కాడని పేద వారికీ తమవంతు సాయం గా 350 కుటుంబాలకు కూరగాయలు గ్రామం లోని ప్రజలందరికి మాస్క్ లు పంపిణి చేసిన వైసీపీ నేతల దాతృత్వం ఇది.మండల కేంద్రం వరికుంటపాడు లోని ఎస్సి, ఎస్టీ, కాలనీ లకి చెందిన 350  కుటుంబాలకు కూరగాయలు పంపిణి చేసారు, అలాగే గ్రామం లోని ప్రజలకు 1500 మాస్క్ లను సైతం అందచేశారు. గ్రామానికి చెందిన బొడ్డు వెంకటేశ్వర్లు, పోలుబోయిన మల్లికార్జున, రేగలగడ్డ బంగారు బాబు, నేలటూరి నాగరాజు, కొండిపోగు దిలీప్ కుమార్, ఆండ్ర తేజ రెడ్డి కలిసి కూరగాయలు, మాస్క్ లను ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ గుంటుపల్లి రామాంజనేయులు చేతుల మీదగా పంపిణి చేసారు, ఈ కార్యక్రమం లో ఎస్ఐ ఉమా శంకర్, ఎంపీడీఓ సురేష్ కుమార్ తదితరులు పాలొగొన్నారు