రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద నాయీ బ్రాహ్మణ సోదరుల ఆవేదన
నెల్లూరు, ఏప్రిల్ 21 (అంతిమ తీర్పు): నాయి బ్రాహ్మణ సోదరులు నెల్లూరు జిల్లా లో 1.20 లక్షలు మంది ఉన్నారు. అందులో 60 వేలమంది కులవృత్తి మరియు నాదస్వరం డోలు కళాకారులు, ఉన్నారని జిల్లా అద్యక్షులు ఈదర.శ్రీనివాసులు తెలిపారు.
ఈ కరోనా మహమ్మారి
మా ఆరోగ్య రిత్యా (మన రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు) స్వచ్ఛందంగా బంద్ చేసి ఇంటికి దగ్గర ఉండటం వల్ల కుటుంబ పోషణ కొరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నము అని తెలిపారు.
మా కులవృతి చేస్తు జీవనం సాగిస్తున్న మా నాయీ బ్రాహ్మణులు షాపులు ఓపన్ చేస్తే పోలిస్ వారి లాఠీ దెబ్బలు మరియు కేసులు, ఫైన్ లు వేస్తున్నారు అని తెలిపారు. కష్టమర్ ను పట్టుకుని మరి మా వృతి చేయాలి
అందులో ఈ కరోనా వైరస్ ఉన్నా వ్యక్తి వచ్చిన ,మేము చేసిన మాకు వైరస్ సోకే అవకాశం ఉంది. కరోనా వైరస్ గురించి తెలిసి కూడ మా కుటుంబం పోషణ కొరకు మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నది అప్పులు కూడ పుట్టుక
ఇబ్బంది పడుతున్నము
పూట గడవడం చాలా కష్టంగా ఉంది
జిల్లా నాయి బ్రాహ్మణ సోదరులు చాలా కంగారు పడుతున్నారు.
మా ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి,మీరు మామీద దయవుంచి మా కష్టాలను గుర్తుంచి మాకు అర్థికంగా సహయం చేయాలి, అని కోరారు. అపారమైన నమ్మకంతో ఉన్నాము
మా చేతివృత్తుల పథకం ద్వారా మా నాయి బ్రాహ్మణ కులాన్నికి 10,000/రూపాయిలును ప్రకటించి నిధులు కూడ విడుదల చేసే సమయానికి ఈ (కరోనా మహమ్మారి) రావడం వల్ల ఆగిపోవడం జరిగింది కావున ఇప్పుడు ఉన్నా క్లిష్టమైన పరిస్థితులలో మా నాయి బ్రాహ్మణ కులాన్నికి 10,000/రూపాయిలు మంజూరు చేయించి మా కుటుంబాలని, మమ్మల్ని బ్రతకించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము అని కోరారు.