భరతమాత సేవలో బి.జే. పి.నాయకులు వై.వి.సుబ్బారావు

భరతమాత సేవలో 40 వసంతాలు పూర్తి చేసుకున్న భారతీయ జనతా పార్టీ - జిల్లా కార్యదర్శి  వై.వి.సుబ్బారావు  ఏప్రిల్ 06, 2020 అమరావతి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు గుంటూరులో బిజెపి జిల్లా కార్యదర్శి  వై.వి.సుబ్బారావు గారి నివాసం వద్ద బిజెపి జెండాను స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎగురవేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1952 సంవత్సరంలో జాతీయోద్యమ నేత, మాజీ కేంద్ర మంత్రి అయిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి అధ్యక్షతన ఏర్పాటైన జనసంఘ్ పార్టీ 06 ఏప్రిల్ 1980 సంవత్సరంలో శ్రీ అటల్ బిహారీ వాజపేయి జీ, లాలకృష్ణ అడ్వాణీ గారి సారధ్యంలో భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుందని జిల్లా కార్యదర్శి  వై.వి.సుబ్బారావు తెలిపారు. అనంతరం తొలి అధ్యక్షునిగా అటల్ బిహారీ వాజపేయి గారు బాధ్యతలు స్వీకరించారని, జనసంఘ్ పార్టీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ  స్థాపించిన తర్వాత కొద్ది కాలానికి దీన దయళ్ ఉపాధ్యాయ గారు తోడై పార్టీ సిద్ధాంతాలైన ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ ప్రతిజ్ఞతో పనిచేసి పార్టీకి జీవం పోశారని తెలిపారు. చివరికి వారి ప్రాణాలను సైతం దేశం కోసం, పార్టీ సేవలో అర్పించారని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ ప్రస్థానం1984 సంవత్సరంలో  కేవలం 2 సీట్లతో మొదలై దినదినాభివృద్ధి చెందుతూ 2019 ఎన్నికల్లో శ్రీ నరేంద్ర మోదీ, అమిత్ షా గారి సారధ్యంలో 303 చేరుకొందని తెలిపారు. దాదాపు 18 కోట్ల పైగా అత్యధిక సభ్యత్వం కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిందని, భారతీయ జనతా పార్టీలోని ప్రతీ కార్యకర్త "భారత్ మాతా కీ జై" అనే నినాదంతో ఏకతాటిపై నడిచి జీవితాంతం పార్టీకి సేవ చేయడం పార్టీ సైద్ధాంతిక క్రమశిక్షణకు నిదర్శనం అని అన్నారు. భారతీయ జనతా పార్టీ 40 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  జిల్లా కార్యదర్శి  వై.వి.సుబ్బారావు ప్రతీ కార్యకర్తకు శుభాకాంక్షలు తెలియజేసారు.  ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులలో ప్రపంచంలోని దిగ్గజ దేశాలు సైతం కరోనా వైరస్ దాడికి అతలాకుతలం అవుతున్న వేల, ప్రపంచ దేశాల అగ్రనాయకత్వం సైతం ఆశ్చర్య పోయేలా మన దేశాన్ని కరోనా నుండి రక్షిస్తూ మనందరిని ముందుడి నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్రమోదీ లాంటి పటిష్టమైన నాయకున్ని దేశానికి అందించిన ఘనత ఒక భారతీయ జనతాపార్టీకి మాత్రమే చెందుతుందని అన్నారు. భారతీయ జనతాపార్టీ మనదేశానికి నిరంతరం ప్రజాసేవ కోసం తరించే ఎంతోమంది దేశభక్తులను అందించి మన దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతోందని అన్నారు. తన మిత్ర పక్షాలతో కలిసి కేంద్రంలో అప్రతిహాసంగా మరో ముప్పై సంవత్సరాల వరకు కూడా తమ పాలనను కొనసాగిస్తుందని జోస్యం చెప్పారు. కరోనా వైరస్ మీద దాడిలో భాగంగా విధించిన లాక్డౌన్ వల్ల ఆకలితో ఇబ్బంది పడుతున్న వారికి తన వంతు సహాయసహకారాలను అందిస్తూనే, వారందరికీ సంఘీభావంగా దేశంలోని భారతీయ జనతాపార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు మొత్తం ఉపవాస దీక్షను చేపడతారని తెలిపారు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా జాతీయ పార్టీ ఆదేశానుసారం PM CARES ఫండ్ కు తమ వంతు సహాయాన్ని అందించాలని బిజెపి జిల్లా కార్యదర్శి  వై.వి.సుబ్బారావు కోరారు. (వై.వి.సుబ్బారావు)