*నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ*
కరోనా మహమ్మారి ప్రభలకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నేపధ్యంలో, నిరుపేద కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. వారికి చేయూతగా జాతీయ సర్వే దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు, గూడూరు మండల సర్వేయర్ సి.హెచ్ రాంకుమార్, గూడూరు డివిజన్ అధ్యక్షులు చిల్లకూరు మండల సర్వేయర్ బి.సుధాకర్ గూడూరు రెవిన్యూ పరిధిలోని పురిటిపాళెం, రోటరీ నగర్, శారదానగర్ ప్రాంతాలలో సుమారు 150 గిరిజన కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లు పాల్గొన్నారు.