మంత్రి శ్రీను  సేకరించిన విరాళాలను బహిరంగపరిచి ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయాలి : పోతిన వెంకట మహేష్

వార్డు వాలంటీర్ అడ్మిన్తో పాటు స్థానిక వైసిపి నాయకత్వాన్ని కూడా కరోనా టెస్టులు చేయాలి.


వైయస్ విజయమ్మ  మానవత్వంతో రాజధాని అమరావతి పై స్పందించి అమరావతిని రాజధానిగా కొనసాగాలని వారి కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి సూచించాలి


మంత్రి శ్రీను  సేకరించిన విరాళాలను బహిరంగపరిచి ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయాలి.


లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 53వ డివిజన్ స్థానిక వైసీపీ అభ్యర్థి పై పోలీస్ కేసు నమోదు చేసినందున అనర్హుడిగా ప్రకటించాలి


విజయవాడ వన్ టౌన్ గణపతి రోడ్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ విజయవాడ వన్ టౌన్లో కరోనా పాజిటివ్ కేసు కింద నమోదైన వార్డు వాలంటీర్ అడ్మిన్ కు ఎటువంటి మెడికల్ డ్రెస్ వేయకుండానే తరలించడం ప్రజలను తీవ్ర ఆందోళనకు, భయభ్రాంతులకు గురి చేసిందని, ఇంతవరకు వారి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్కు తరలించ లేదని, సాధారణ పౌరులు అయితే మెడికల్ డ్రెస్ వేసి అధికారులు పోలీసు శాఖ వారు హడావిడి చేసే వారని, వార్డు వాలంటీర్ కనుకనే ప్రజా ఆరోగ్య భద్రత ని గాలికొదిలేసి మెడికల్ డ్రెస్ వేయకుండానే క్వారంటైన్కు తీసుకెళ్లారని, అదేవిధంగా వాలంటీర్ అడ్మిన్ శుక్రవారం సాయంత్రం వరకు వీధుల్లోనే ఉన్నారని వారు  వాలంటీర్ల తో విధులు నిర్వహించారో రేషన్  ఎక్కడ అందజేశారో, స్థానిక వైసిపి నాయకత్వంతో ఎక్కడ కలిసి పనిచేశారో వారందరికీ తప్పనిసరిగా కరోనా  టెస్ట్ చేయాలని తద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించాలని అధికారులను కోరారు. వార్డు వాలంటరీ అడ్మిన్నువ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఎందుకు చూడలేదని కరోనా పాజిటివ్ అని తెలిసిన కూడా విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు గానీ, కలెక్టర్ గారు గానీ, నగర పోలీస్ కమిషనర్ గారు గానీ స్పందించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. వాలంటీర్ల తో కలిసి  స్థానిక వైసిపి నాయకత్వం ప్రజల దగ్గరికి వెళ్తున్న వాళ్ళందరికీ  వార్డు వాలంటీర్లతో పాటు స్థానిక వైసిపి నాయకులు కూడా కరోనా టేస్ట్ లు చేయాలని డిమాండ్ చేశారు.


వైయస్ విజయమ్మ గారు మానవత్వంతో 200 మంది పురోహితుల పట్ల స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే రాజధాని ప్రాంతంలో మహిళలు, రైతులు 4 నెలలుగా చేస్తున్న ఉద్యమం పట్ల కూడా మానవత్వంతో స్పందించి రాజధాని అమరావతి లోనే కొనసాగే విధంగా వారి కుమారుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేయాలని మహేష్ కోరారు.


స్థానిక 53 డివిజన్లో వైసీపీ అభ్యర్థి  లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వివాహ వార్షికోత్సవ వేడుకలను రోడ్లపై నిర్వహించినందుకు పోలీస్ శాఖ కేసులు నమోదు చేశారని, దీనికి మంత్రి శీను గారు నైతిక బాధ్యత వహిస్తూ స్థానిక అభ్యర్థిని పోటీ నుంచి తప్పించాలని మహేష్ డిమాండ్ చేశారు.


మంత్రి  శ్రీను గారు కరోనాను కూడా వదల్లేదని కరోనాను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తూ విరాళాలు సేకరించి తానేదో ప్రజలకి కూరగాయలు పంచినట్లు ఉచిత బిల్డప్ ఇస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారని సేకరించిన విరాళాలు మొత్తాన్ని బహిరంగ పరచి మిగిలిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయాలని  డిమాండ్ చేశారు . రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేస్తుంటే ఉంటే మంత్రి శీను గారు మాత్రం సేకరించిన విరాళాలను తన ఖాతాలో జమ చేసుకుంటున్నారని మహేష్ అన్నారు.