గూడూరు లో స్థలాలు పరిశీలించిన సబ్ కలెక్టర్ అధికారులు.

        గూడూరు, ఏప్రిల్ 14,(అంతిమ తీర్పు ) :            నెల్లూరు  జిల్లా ఆసుపత్రి లో ఖ్వారంటయిన్ లో వుంటూ 10 రోజులు దాటి నెగటివ్ రిపోర్టు వచ్చిన వారిని వారి వారి  ప్రాంతాల్లోనే క్వారన్టైన్ లో ఉంచమని ఆదేశాలు, గూడూరు లో స్థలాలు పరిశీలించిన సబ్ కలెక్టర్ అధికారులు.


ఉనతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ  గూడూరు మునిసిపల్ కమీషనర్, గూడూరు DSP మరియు ఇతర వైద్య, రెవెన్యూ, పోలీస్ అధికారులు గూడూరు డివిజన్ కి సంభందించి నెల్లూరులో క్వారంటైన్ లో ఉన్న వారిని తీసుకొని వచ్చి పెట్టుటకు గాను గూడూరు టౌన్ లో ఉన్న VSR, ద్వారక, శ్రీ కృష్ణ, బ్లూ డైమండ్ లాడ్జి లను పరిశీలించారు.


తొందర్లో నెల్లూరు ఆసుపత్రి లో ఉన్న గూడూరు డివిజన్ కి చెందిన వారిని ఇక్కడికి తరలించే అవకాశం ఉంది...