జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించాలి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలకు డిమాండ్

*కరోనా వైరస్ పోరాటంలో వైద్యులు, పోలిసులు, పారిశుధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు. పలు చోట్లల్లో జర్నలిస్టులు సైతం కరోనా బారినా పడ్డారు . అయితే ధైర్యంగా విధులు నిర్వర్తిస్తోన్న జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటను విడుదల చేశారు పవన్ కళ్యాణ్..


"కరోనా విపత్తులోనూ తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులు చాలా ధైర్యంగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. తెలంగాణాల్లో కన్ని చోట్ల జర్నలిస్టులు కూడా క్వారంటైన్‌ కు వెళ్ళినట్లు తెలిసింది. పాత్రికయులు తమ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ విధులు చేపట్టాలి. పొరుగున ఉన్న తమిళనాడులో 25 మంది, ముంబయిలో 50మందికిపైగా జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌ అని తేలిన నేపథ్యంలో పాత్రికేయులకు అవసరమైన ఆరోగ్య భద్రత, బీమాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. జర్నలిస్ట్‌ సంఘాలు, మీడియా సంస్థలు జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను." అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు