*07-04-2020*
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మనం బయట తిరగడం శ్రేయస్కరం కాదు
*సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి*
*టి ఆర్ నగర్ సచివాలయ ఇంచార్జి సెక్రటరి ఎ. రమేష్ *
డోన్ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంటు డాక్టర్ వై. శ్రీనివాసులు సార్, డోన్ మున్సిపల్ కమీషనర్ కె యల్ యన్ రెడ్డి లు విడుదల చేసిన
కరోనా వైరస్ (కోవిడ్ 19) కరపత్రాలను
డోన్ పట్టణంలో మంగళవారం తారకరామానగర్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి, సచివాలయ ఇంచార్జి సెక్రటరి ఆద్వర్యంలో కరోనా నివారణ కరపత్రల పంపిణి చేసి అవగాహణ కలిగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంబిస్తున్న నేపద్యంలో దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి.ఈ కరోనా కష్టకాలంలో మనమందరం మన కుటుంబాలతో స్వీయ రక్షణలో ఉండాలి. లాక్ డౌన్, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలి. కాబట్టి తప్పని సరిగా జాగ్రత్తలు పాటించి మన ఆరోగ్యాల తో పాటు ఇతరుల ఆరోగ్యాలను కాపాడాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి సూచించారు.
మీ
పి. మహమ్మద్ రఫి సామాజిక కార్యకర్త డోన్