గుంటూరు జిల్లా కు చెందిన చిన్నారి గూడూరు లో మృతి

నెల్లూరు జిల్లా.   :..చిల్లకూరు మండలం లో  గురుకుల పాఠశాలలో కరోనా లాక్ డౌన్ కారణంగా  ఉంటున్న వలస కూలీల్లో 4.నెలల చిన్నారి మృతి. 


*గుంటూరు జిల్లా నుండి చిల్లకూరు మండలంలోని రెట్టపల్లిలో కాంక్రీటు పనుల నిమిత్తం వచ్చిన వలస కూలీలు సుమారు 30.మందిని లాక్ డౌన్ కారణంగా వారందరికీ భోజనం,నివాస వసతి కల్పించడంకోసం చిల్లకూరు గురుకుల పాఠశాలలో ఉంచారు.ఈరోజు తెల్లవారి జామున 4.గంటలకు సమయంలో 4.నెలల చిన్నారి అశ్వస్తకు గురవడంతో వారు స్థానిక పీడీ.జానకిరామయ్య,ఇంచార్జి ప్రిన్సిపాల్ ఇబ్రహీం సహకారంతో వెంటనే గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయి నట్లు వైద్యులు నిర్ధారించదవడంతో బిడ్డను తీసుకొని గురుకుల పాఠశాలలకు వచ్చేశారు.స్థానిక తహసీల్దార్ రవికుమార్ అక్కడకు చేరుకొని వారిని విచారిస్తున్నారు.