జర్నలిస్టులకు కరోనా చుట్టమా..

*జర్నలిస్టులకు కరోనా చుట్టమా..?* 


జర్నలిస్టులకు పీపీఈ లు అక్కర్లేదా..?
జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ అక్కర్లేదా..?
జర్నలిస్టులకు జీతాలే లేవు, ఆర్ధిక సాయం అక్కర్లేదా..?
జర్నలిస్టులకు కుటుంబాలు లేవా? వారి భవిష్యత్ ఏంటి..?


కరోనా తో పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులే సమాజానికి, ప్రభుత్వానికి కనిపిస్తున్నారా..? 


సమాజం ఇంట్లో కదల కుండా కూర్చోవాలంటే, వారి ఇంట్లోకి సమాచారాన్ని చేర వేసేది జర్నలిస్టులే (టివి, పత్రికలే)..


కరోనా మహమ్మారి భయంతో ప్రపంచం వణుకుతూ, ఇంట్లోనే ఉంటే.. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి పోయారు?, మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? మీ గ్రామం ఎలా ఉంది? మీ ఇంటి బయట ఏమి జరుగుతుంది..? ప్రభుత్వం ఏమి చేస్తుంది.? పోలీసులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు.? వైద్యులు ఎలాంటి సాహసోపేత వృత్తి ధర్మం పాటిస్తున్నారు అని, అను నిత్యం మిమ్మల్ని టీవీ లకి, పత్రికలకు కట్టి పడేసేలా ప్రాణాలను పణంగా పెట్టి వృత్తి ధర్మం పాటిస్తుంది జర్నలిస్టులే..


ప్రభుత్వం.. కనీస గౌరవ వేతనమే కాదు కదా, అత్యవసర విధుల్లో భాగమైనా కనీసం ఇన్సూరెన్స్ కూడా ప్రత్యేకంగా ప్రకటించలేక పోయింది.. వారి ఆర్ధిక పరిస్థితి అర్ధం చేసుకోలేక పోయింది.. కరోనా నివారణలో మీరే ప్రథమ పాత్ర అంటూ డేంజర్ జోన్ లోకి నెట్టివేస్తూ కనీసం పీపీఈ (Personal protective equipment) లు కూడా ప్రభుత్వం సరఫరా చేయలేక పోతుంది.


ఇవేమీ పాలకులకు పట్టవా..? జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాలలో భాగస్వాములై, ఉద్యోగాలు జీతాలు, ఇన్సూరెన్స్ లు దక్కించు కోవడంతో, ఇక జర్నలిస్టుల బాగోగులు మర్చి పోయారా...? ఒక్కటి గుర్తుంచుకోండి జర్నలిస్ట్ మిత్రులారా...!


మీకు ఎలాంటి ప్రత్యేక ఇన్సూరెన్స్ కేంద్రం ప్రకటించలేదు..? రక్షణ ముఖ్యం, మీ కోసం కాదు, మీ కోసం వేచి చూసే మీ కుటుంబ సభ్యుల కోసం.. ప్రభుత్వం స్పందించవచ్చు, ఎప్పటి లాగే ఊరుకోవచ్చు, మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి..
Be careful .. 


*మీ, జర్నలిస్ట్*