మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు విజ్ఞప్తి

 


     హైదరాబాద్, ఏప్రిల్ 21, (అంతిమ తీర్పు) :                 ముంబయిలో 53 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకిన వార్తలు వస్తున్నందున తెలుగు రాష్టాల్లోని జర్నలిస్టులందరూ ఈ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు.


 వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు,  పారిశుధ్య కార్మికులు, పారిశుధ్య సిబ్బందితో పాటు జర్నలిస్టులు కూడా వైరస్ ప్రభావం పొంచి ఉన్నప్పటికీ జర్నలిస్టులు సమాచార సేకరణ కోసం విధి నిర్వహణలో నిరంతరం పాల్గొంటున్నారు. ఇట్లాంటి క్లిష్ట  పరిస్థితిలో జర్నలిస్టులు వృత్తి కత్తి మీద సాము లాంటిది. వార్తలు, సమాచారం కోసం అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాపించిన ప్రాంతాలకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉన్నందున, జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. వృత్తి కన్నా ప్రాణం విలువైనదని, ముందుగా ప్రాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులనుండి వస్తున్న సమాచారం మేరకు జర్నలిస్టులు కరోనా వైరస్ పట్ల తగిన జాగ్రత్తలు పాటించడం లేదని తెలియవస్తున్నది. 
 *జర్నలిస్టులు..ఈ జాగ్రత్తలు  పాటించండి*
1.  ప్రతి ఒక్క జర్నలిస్టు మాస్కు  తప్పని సరిగా ధరించి విధులు నిర్వహించాలి.   
2. సామాజిక దూరం పాటించకుండా రిపోర్టింగ్ చేయరాదు. 
3. శానిటైసర్ ను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. 4. న్యూస్ కవర్ చేసేటప్పుడు గుంపులుగా గుమికూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 5. మీ కుటుంబం మీ కోసం ఎదురు చూస్తున్నదని, కుటుంబానికి మీరే పెద్ద దిక్కు అని గుర్తించండి
6. మీడియా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాలలో జర్నలిస్టులు  సామాజికదూరం పాటించే విధంగా సీటింగ్ ఆరెంజిమెంట్స్ చేసుకోవాలి.
7.  జర్నలిస్టులకు మాస్కులు, శానిటైసర్లు అందుబాటులో ఉంచాలి.
8. యాజమాన్యాలు  జర్నలిస్టుల కోసం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి.
9.జర్నలిస్టులు అత్యవసర సేవల విభాగంలోనికి వస్తారు కనుక వారికి రక్షణ కిట్లను ప్రభుత్వం సమకూర్చాలి.
10.జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలి.