*అమరావతి*
*కోవిడ్ –19పై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
*అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ –19 వ్యాప్తి, నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
*మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరు*
ఢిల్లీ వెళ్లిన వారికి, వారితో కలిసి మెలిగిన వారికి దాదాపు పరీక్షలు పూర్తి:
– రాష్ట్రంలో కోవిడ్ విస్తరణ, నమోదైన కేసులో ముఖ్యమంత్రికి వివరాలు అందించిన వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి
– ఈ ఉదయం 9 గంటలవరకూ రాష్ట్రంలో 266 కేసులు నమోదయ్యాయని వెల్లడి
– 266లో 243 కేసులు ఢిల్లీ జమాత్‌కు హాజరైన వారు, వారి కాంటాక్ట్ అయినవారేనని వివరించిన అధికారులు
– ఢిల్లీ వెళ్లినవారు, వారితో కలిసి మెలిగిన వారికి ( ప్రైమరీ కాంటాక్ట్స్) దాదాపుగా పరీక్షలు పూర్తయ్యాయని వెల్లడించిన అధికారులు
– దీనితర్వాత వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు ఇంటింటికీ సర్వేచేసి వ్యాధి లక్షణాలతో ఉన్నవారిని గుర్తించారని, వీరిలో ఎవ్వరికి పరీక్షలు చేయించాలన్నదానిపై వైద్యులు నిర్ధారిస్తున్నారని, వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తాని తెలిపిన అధికారులు
*పెరగనున్న టెస్టింగ్ సామర్థ్యం:*
– విశాఖపట్నం, గుంటూరు, కడప జిల్లాలో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్టుగా అధికారులకు సీఎంకు వెల్లడించారు.
– ఐసీఎంఆర్ కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్త విధానాలను అనుమతి ఇచ్చిందని, ఈ పద్దతుల్లో ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపిన అధికారులు
– దీని ప్రకారం 240 పరికరాలు రానున్నరోజుల్లో వస్తాయని, ఒక్కో పరికరం ద్వారా రోజుకు కనీసం 20 శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందన్న ఆరోగ్యశాఖ అధికారులు
– ప్రాథమిక స్థాయి పరీక్షల వల్ల వైద్య పరంగా సత్వర చర్యలకు మరింత అవకాశాలు కలుగుతాయని తెలిపారు.
– వీలైంతన త్వరగా ఈ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
– అలాగే స్వచ్ఛంద సంస్థ ద్వారా టెలీమెడిసన్ సర్వీసులు అదించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
– ఐసోలేషన్‌లో ఉన్నవారు ఎవరైనా సరే ఫోన్ చేసి వైద్యం పొందవచ్చని తెలిపిన అధికారులు.
*భవిష్యత్తు విధానాలపైనా చర్చ:*
– రాష్ట్రంలో కోవిడ్ –19 నివారణా చర్యల్లో భాగంగా ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలేకాకుండా భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై కూడా సమావేశంలో చర్చ
– ర్యాండమ్ టెస్టు కిట్లు ద్వారా ప్రజలనుంచి నమూనాలు సేకరించి ఆమేరకు డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషించుకునే దిశగా చర్యలకు నిర్ణయం.
– సమూమంగా పనిచేసే ప్రాంతాల్లో ఈర్యాండమ్ కిట్లు ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసే అవకాశం ఉంటుందని సమావేశంలో చర్చ.
– ఇదే సమయంలో వ్యాధినిరోధకత ద్వారా కరోనా వైరస్‌ను సమర్థవంతగా వ్యవహరించేవారిని గుర్తించి... వారినుంచి నమూనాలు సేకరించి కొత్త వైద్య విధానాలు రూపొందించుకోవాలని సమావేశంలో ప్రస్తావన.
– దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు తయారుచేసుకుని ముందడుగు వేయాలని నిర్ణయం.
– అలాగే విశాఖలో చేసిన విధంగా రెడ్‌జోన్లు, క్లస్టర్ల వారీగా ర్యాండమ్ పరీక్షలపై కూడా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశం.
*క్వారంటైన్, ఐసోలేషన్ క్యాంపుల్లో మంచి సదుపాయాలు:*
– క్వారంటైన్, ఐసోలేషన్ క్యాంపుల్లో సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలన్న సీఎం
– వారికిచ్చే సదుపాయాల్లో క్వాలిటీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
– ఈ విషయంలో రూపొందించుకున్న ఎస్‌ఓపీ ప్రకారం ముందుకెళ్లాలన్న సీఎం
*కోవిడ్ ఆస్పత్రులపై సన్నద్ధత:*
– కోవిడ్ ఆస్పత్రుల సన్నద్ధతపైనకూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
– ప్రతి ఆస్పతిలోనూ ఐసోలేషన్‌వార్డుల ఏర్పాటు, వాటి అమలు విధానాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్న సీఎం
– ఐసీయూ బెడ్లు, వాటి సంఖ్యకు తగినట్టుగా వైద్య సిబ్బందిని ఉంచుతున్నామన్న అధికారులు
– నిర్దేశించుకున్న సంఖ్యలో సిబ్బందిని ఉంచేలా చర్యలు చేపడుతున్నామన్న అధికారులు
–వారంరోజులపాటు సేవలు అందించే సిబ్బంది తర్వాత 14రోజులపాటు ఐసోలేషన్‌కు పంపించేలా నిర్దేశించుకున్న వైద్యప్రణాళికను అమలుచేస్తామన్న అధికారులు
– దీనివల్ల ఎక్కువమంది వైద్యులు, సిబ్బంది అవసరం అవుతారని, దీనిపై తగిన రకంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించిన అధికారులు
– కోవిడ్–19 ప్రభావిత ప్రాంతాలకు మొదట ప్రాధాన్యత ఇచ్చి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్లు, మాస్కులు తగినట్టుగా ఉంచాలన్న సీఎం
*గుజరాత్‌కు ఏపీ నుంచి అధికారులు:*
– ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం గుజరాత్‌లో ఉన్న తెలుగువారి బాగోగులు చూసుకోవడానికి ఏపీ నుంచి అధికారులను పంపిన ప్రభుత్వం
– అక్కడ భోజన సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నామన్న అధికారులు
– రాష్ట్రంలోని క్యాంపులకు ఒక్కో అధికారిని నియమించామని తెలిపిన అధికారులు
– అవసరాలకు అనుగుణంగా క్యాంపులను ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నామని, ఇప్పటివరకూ 314 క్యాంపుల్లో 16,479 మందికి అన్నిరకాల సదుపాయాలు ఇస్తున్నామన్న అధికారులు
– హాస్టల్‌వార్డెన్లను క్యాంపు అధికారిగా, జిల్లాకు ఒక అధికారినీకూడా ప్రత్యేకంగా నియమించామన్న అధికారులు.
– 1902కి వచ్చిన కాల్స్ ద్వారా సమాచారం తీసుకుని వాటిని పరిష్కరిస్తున్నామన్న అధికారులు
– వచ్చిన ప్రతికాల్‌కు వెంటనే స్పందించాలని, ఆ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని సీఎం ఆదేశం
*వ్యవసాయం, ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై వారంలో ప్రత్యేక యాప్:*
– గ్రామ సచివాలయాలు, ఆర్బేకేల ద్వారా, అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా పంటలు, వాటి పరిస్థితి, ఉత్పత్తి, మార్కెటింగ్, ధరలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రియల్‌టైంలో తెలుసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలంటూ సీఎం ఆదేశాలు
– ఈ మేరకు రూపక్పలన
– ఈ వారంలో దాన్ని అందుబాటులకి తీసుకొస్తున్నామన్న అధికారులు
– చీనీ, బొప్పాయి, అరటి, మామిడి, టమోటా రైతులకు ఇబ్బందులు రాకూడదని స్పష్టంచేసిన సీఎం
– బొప్పాయి పంటపై దృష్టిపెడుతున్నామన్న అధికారులు
– అలాగే చీనీ పంట ఉత్పత్తులపైనా కూడా దృష్టిపెడుతున్నాం
అలాగే మామిడి పంట కూడా మార్కెట్లోకి వస్తోందని తెలిపిన అధికారులు
– రైతులనుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, ప్రస్తుత విపత్తు సమయంలో వారికి సహాయం చేసే విషయలో నూటికి 110 శాతం అన్నిరకాల సహకారం అందిస్తానని స్పష్టంచేసిన సీఎం
– అరటి పంట విషయంలో సమస్యలను తీర్చగలుగుతున్నామన్న అధికారులు
– ఎప్పటికప్పుడు పంటను బయట రాష్ట్రాలకు, స్థానిక మార్కెట్లకు పంపుతున్నామన్న అధికారులు
– తూర్పుగోదావరి, అనంతపురం, కడప జిల్లాలపై దృష్టిపెడుతున్నామన్న అధికారులు
– రైతు బజార్లు, స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రయోగాత్మకంగా ఇప్పుడున్న పంటల ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నామన్న అధికారులు
– దీన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నామన్న అధికారులు
– పంటనూర్పిడిలో ఇబ్బందులు రాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా హార్వెస్టర్‌లను తెప్పిస్తున్నామన్న అధికారులు
– కోవిడ్ –19 రెడ్‌జోన్లలో ఉన్న కర్నూలు, గుంటూరు మార్కెట్ యార్డులను తాత్కాలికంగా వేరే చోటుకు తరలించాలని అధికారుల నిర్ణయం
*ఆక్వా రైతులకు నష్టం చేకూర్చేవారిపై చర్యలు:*
– బెంగాల్, అసోం, బిహార్ లాంటి రాష్ట్రాలకు చేపల రవాణాలో ఇబ్బందులను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలన్న సీఎం
– ఆక్వా ఉత్పత్తుల కొనుగోలులో రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధం చేశామన్న అధికారులు
– అలాగే ఆక్వా దాణా రేట్లపై కూడా దృష్టిపెట్టాలన్న సీఎం
– ఫీడు, సీడుపై నియంత్రణ, పర్యవేక్షణపై అసెంబ్లీలో బిల్లు తీసుకురావాలని నిర్ణయం
– మే 31 నాటికి రైతు భరోసా కేంద్రాల కార్యకలాపాలు ప్రారంభం కావాలని సీఎం స్పష్టీకరణ