లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులు అక్రమార్కులకు సహకరించవద్దు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

 


తేది: 11.04.2020
అమరావతి


లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులు అక్రమార్కులకు సహకరించవద్దు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణస్వామి.


అమరావతి, 11 ఏప్రిల్: లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులు అక్రమార్కులకు సహకరించవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణస్వామి అధికారులను హెచ్చరించారు. అన్ని జిల్లాల ఎక్సైజ్ శాఖాధికారులతో ఉపముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ కొన్ని చోట్ల మద్యం అక్రమాలలో ప్రమేయం ఉన్న ఎక్సైజ్ శాఖ  అధికారులను సస్పెండ్ చేశామని తెలిపారు. శాఖాపరమైన విచారణ చేసి తొలగించడానికి వెనకాడబోమని హెచ్చరించారు.  లాక్ డౌన్ సమయము లో మద్యపాన నిషేధం అమలు చేయడం వలన నవరత్నాలలోని దశలవారీగా మద్యపాన నిషేదమును భవిష్యత్తులో అమలుపరచడానికి చక్కటి అనుభవముగా ఉపయోగపడుతుందన్నారు. కనుక ఎక్సైజ్ అధికారులంతా నిబద్దత తో పనిచేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్రము లో అన్ని బార్లలో స్టాక్ ఇన్స్పెక్షన్ చేయాలన్నారు. మద్యం అక్రమాల వెనుక ఉన్నవారి పై  పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టిస్తామన్నారు. లాక్ డౌన్ కాలం లో నిత్యావసరాలకు ఇబ్బందులు పడకూడదని డిపోల్లో పని చేసే హమాలీ లకు రూ. 5000/-  అడ్వాన్సు ఇస్తున్నామన్నారు. ఐడీ, ఎన్డీపీఎల్ అక్రమాలలో ఉన్న వారికి ప్రభుత్వ పథకాలను నిపివేసే ఆలోచన కూడా చేస్తామని హెచ్చరించారు. 


 


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు