ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన విద్యార్థులు , వలన కూలీలకు అండగా నిలుస్తున్నాం

 


విజయవాడ , తేది : 8 - 4 - 2020 


* ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన విద్యార్థులు , వలన కూలీలకు అండగా నిలుస్తున్నాం


* అర్హులైన ప్రతి ఒక్కరికి రూ . 1000 ల ఆర్ధిక సహాయం అందించమని ముఖ్యమంత్రి ఆదేశం


* నిత్యావసరాల లభ్యత , రవాణ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం -
 ప్రిన్సిపల్ సెక్రటరీ  ఎం.టి . కృష్ణబాబు


మన రాష్ట్రం నుండి వెళ్ళి పక్క రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులు , వలస కార్మికుల సంక్షేమం  కోసం కోవిడ్ - 19 నేపథ్యంలో   అన్ని విధాలుగా సహాయ సహకరాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారని టాస్క్ ఫోర్సు కమిటీ చైర్మన్ ఎంటి. కృష్ణబాబు తెలియచేశారు.


 విజయవాడలోని ఆర్ అండ్ బి  భవన సముదాయ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర , ముఖ్య కార్యదర్శి ఆరా శ్రీకాంత్ లతో పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోవిడ్ - 19 లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని 10 రాష్ట్రాలలో సుమారు 8.183 మంది మున రాష్ట్రానికి చెందిన విద్యార్థులు , వలస కూలీలు ఆయా రాష్ట్రాలలోని పునరావాస కేంద్రాలలో ఉన్నట్లు గుర్తించామన్నారు . ఇందులో అత్యధికంగా గుజరాత్ రాష్ట్రంలో 6 వేల మంది మత్స్యకారులు ఉన్నారన్నారు. వారి బాగోగులు తెలుసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయూతనందించేందుకు రెవెన్యూ అధికారులను, మత్స్యకారుల సంఘాలకు చెందిన 4 గురిని అక్కడికి పంపడం జరిగిందన్నారు . శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎక్కువమంది మత్స్యకారులు అక్కడ ఉన్నట్లు ఉన్నారన్నారు.  తమిళనాడు రాష్ట్రంలో 1412 మంది పునరావాస కేంద్రాలలో ఉన్నారని వారికి కూడా తగిన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తమిళనాడు ముఖ్యమంత్రితో మాట్లాడటం జరిగిందని కృష్ణబాబు తెలిపారు . అదేవిధంగా మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు సుమారు 50వేల మంది ఉన్నారని, వారికి 353 పునరావాస కేంద్రాల ద్వారా అన్ని వసతులు కల్పించడం జరిగిందన్నారు. ప్రతి క్యాంపులోను ఒక సాంఘిక సంక్షేమ వసతి గృహాల అధికారిని ఉంచడం జరిగిందన్నారు.  వారికి హెల్త్ చెకప్ చేయడానికి డాక్టరును , ఎఎన్ఎం ను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు . రాష్ట్రంలో 208 ప్రదేశాలలో వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులు 50 వేల మంది ఉన్నారని వారికి  సంబంధిత కంపెనీ మరియు కార్మిక శాఖ ద్వారా అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతున్నదని తెలిపారు.  గుంటూరు జిల్లాలో రాష్ట్రానికి చెందిన 61,131 మంది వలస కూలీలు ఉన్నారని, వారిలో 99 శాతం మంది అర్హులను గుర్తించి వారికి నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు.  రాష్ట్రానికి చెందిన ఇతర రాష్ట్రాలలో పునరావాస కేంద్రాలలో ఉన్నవారి బాగోగులను , ఇతర అంశాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర , ముఖ్య కార్యదర్శి అర్జా శ్రీకాంత్ లు ఆయా రాష్ట్రాల అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చూడటం జరుగుతోందని ఆయన తెలిపారు . ఇతర దేశాల నుండి వచ్చిన 200 మంది మన రాష్ట్రానికి చెందినవాడు ఢిల్లీలో ఉన్నారని, వారిని రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు . ఏప్రిల్ 11వ తేదీన ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెస్సులో తెలియజేసే నిర్ణయాల మేరకు తదుపరి కార్యాచరణ  ఉంటుందని తెలిపారు.  మన రాష్ట్రంలోని పునరావాస కేంద్రాలలో ఉన్న వారికి ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని పేర్కొన్నారు. 


 నిత్యావసరాలు తదితరాలకు సంబంధించి ఏర్పాటు చేసిన 1902 టోల్ ఫ్రీ నెంబరుకు ఇప్పటి వరకు 7296 కాల్స్ వచ్చాయని వాటిపై అధికారులు తక్షణమే స్పందిస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా పరిష్కరిస్తున్నారన్నారు.   నిత్యావసరాలైన కందిపప్పు , ఉల్లిపాయలు, బంగాళా దుంప వంటివి మహారాష్ట్ర, తదితర ఇతర రాష్ట్రాల నుండి వస్తాయని ఆయా రాష్ట్రాల అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వాటి రవాణాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు.  అదేవిధంగా మన రాష్ట్రంలో ఉత్పత్తి , కాకినాడ, కృష్ణపట్నం పోర్ట్ ద్వారా రవాణా అయ్యే వంట నూనెలు మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంటాయని వాటిని రవాణా చేస్తున్న వాహనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు.  నిత్యావసర సరుకుల లభ్యతకు సంబంధించి హోల్  సేల్ వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ డిమాండుకు అనుగుణంగా వాటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నానున్నారు . ప్రభుత్వం అందిస్తున్న వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందలేదని 2500 కాల్స్ వచ్చాయని తెలిపారు .


ఇప్పటి వరకు రైస్  కార్డు , తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ సహాయం అందించామని అయితే ఈ రెండు కార్డులు లేని అర్హులైన పేదవారందరికీ కూడా విచారణ చేసి వన్ టైమ్ విధానం (కొలత) కింద వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించమని ముఖ్యమంత్రి ఈరోజు నిర్ణయించారని తెలిపారు.  నిత్యావసర సరుకులతోపాటు మన రాష్ట్రంలో పండుతున్న అరటి తదితర పంటల  రవాణాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటం కోసం రవాణా అధికారులు లారీ ఓనర్స్ అసోసియేషన్ వారితో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించే సరుకు రవాణా వాహన దారుల ఆహారం కోసం 29 దాబాల ద్వారా  భోజనం పార్కిల్ చేసి సరఫరా చేసేందుకు అనుమతించామన్నారు . రాష్ట్రంలో 20 నుండి 27 శాతం సరుకు రవాణా లారీలు తిరుగుతున్నాయన్నారు.  రాష్ట్రంలో పండిస్తున్న అరటి , బత్తాయి వంటి వాటిని డ్వాక్రా సంఘాల ద్వారా గ్రామాలలో విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు