బందరులో ఇక మాస్క్ లు తప్పని సరి...
-------- జిల్లా కలెక్టర్ ఇంతియాజ్
-------------------
కృష్ణాజిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా నమోదవుతున్నాయి . లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండడం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. . దీంతో రెడ్ జోన్ ప్రాంతాలతో సహా పలు ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో రెడ్ జోన్ నగరాలలో , పట్టణాలలో ఆంక్షలు కఠినతరం కానున్నాయి ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాల్సిందేనని ఆర్డర్స్ విధించారు. ఎవరైన మాస్కులు ధరించకుండా ఇళ్లలోంచి వెలుపలకు వస్తే శిక్షార్హులే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నారు. కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
బందరులో ఇక మాస్క్ లు తప్పని సరి - కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్