నిరుపేదలకు బాసటగా నిలవడం అభినందనీయం : కమిషనర్, సీఐ

నిరుపేదలకు బాసటగా నిలవడం అభినందనీయం : కమిషనర్, సీఐ
వైజీఎస్బీఏ ఆధ్వర్యంలో రజకులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ
ప్స్స 1. బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న కమిషనర్2
2. మాట్లాడుతున్న సీఐ జీ. దశరధరామారావు 
విశాలాంధ్ర - గూడూరు : ద యంగ్ గూడూరు షటిల్ బాడ్మింటన్ అసోసియేషన్ నిరుపేదలకు బాసటగా నిలవడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ వై. ఓబులేశు, పట్టణ సీఐ జీ. దశరధరామారావు అన్నారు. ఆదివారం పట్టణంలోని చాకలి వీధిలో వైజీఎస్బీఏ ఆధ్వర్యంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనీస్, వారి మిత్రుల సహకారంతో 30 రజక కుటుంబాలకు ఐదేసి కేజీల బియ్యం, 15 రోజీలకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిజమైన నిరుపేదలను గుర్తించి  బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న అసోసియేషన్ సభ్యుల సేవలను కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక చేయూతనందించిన అనీస్, మిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.  పట్టణ సీఐ జీ. దశరధ రామారావు మాట్లాడుతూ అనీస్ సహకారంతో పనుల్లేక పస్తులుంటున్న రజకులను బాడ్మింటన్ అసోసియేషన్ ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. నిబంధనలు పాటిస్తూ ఇంటింటికీ వెళ్లి బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. ముఖానికి తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఓపిగ్గా ఇళ్లలోనే ఉండాలన్నారు. త్వరలోనే మంచిరోజులు వస్తాయని రజకులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. అసౌసియేషన్ అధ్యక్షులు షేక్ జమాలుల్లా మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురిటిపాలెం గిరిజన కాలనీలో 125 కుటుంబాలకు కూరగాయలు, బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం రజక కుటుంబాలకు చేయూతనందిస్తున్నామన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ కలామ్ మాట్లాడుతూ కరోనా కట్టడికి అహర్నిశలు శ్రమిస్తున్న మున్సిపల్ కమిషనర్, సీఐ, వైద్యులు, పారిశుధ్య కార్మికులకు అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు చమతెలిపారు. అనంతరం కమిషనర్, సీఐల.చేతుల మీదుగా రజక కుటుఃబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు, వైజీఎస్బీఏ ప్రధాన కార్యదర్శి జీ. గిరిబాబు, కార్యదర్శి వల్లూరు రమేష్, స్థానికులు సాధిక్, అగ్ని, శ్రీను తదితరులు పాల్గొన్నారు.