వాలంటీర్లు,జర్నలిస్టులకు భోజనాలందించిన వై.సి.పి నేతలు

వాలంటీర్లు,జర్నలిస్టులకు భోజనాలందించిన వై.సి.పి నేతలు


వింజమూరు, ఏప్రిల్ 21 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లు, జర్నలిస్టులకు మంగళవారం నాడు స్థానిక వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సాయి బాలాజీ బోర్ వెల్స్ ప్రొప్రయిటర్ జూపల్లి.రాజారావు, మాజీ ఉప సర్పంచ్ మద్దూరు.లక్ష్మీప్రసాద్ రెడ్డి, మండాది.గోవిందరెడ్డిలు భోజన ప్యాకెట్లును అందజేశారు. ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అక్బర్ అలీ అహ్మద్ చేతుల మీదుగా భోజనాలను అందరికీ పంపిణీ చేశారు. ముఖ్య అతిధిగా హాజరైన తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ తరుణంలో వాలంటీర్లు, జర్నలిస్టులు తమ తమ విధుల నిర్వహణలో విశేష సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. వింజమూరు మండలంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దాతలు ముందుకు వస్తూ పేద ప్రజలతో పాటు విధులు నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందికి నిత్యావసర సరుకులు, కూరగాయలు, భోజనాలు అందించడం వారి దాతృత్వానికి నిదర్శనమని కొనియాడారు. అందరి కృషి వలనే వింజమూరు మండలం గ్రీన్ జోన్ గా రికార్డులకెక్కిందన్నారు. అయిననూ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా లాక్ డౌన్ ముగిసే వరకు స్వీయ నిర్భంధంలో ఉంటూ ప్రభుత్వాల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి, వై.సి.పి నేతలు రేవునూరి.శ్రీనివాసులురెడ్డి, జక్కం.మోహన్ రెడ్డి, బండి.క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image