యూ.టీ.ఎఫ్ ఆధ్వర్యంలోపారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

*యూ.టీ.ఎఫ్ ఆధ్వర్యంలోపారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
 ఉదయగిరి.:.  పంచాయతీ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న సుమారు 36 మంది పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేద నిరుపేదలైన గిరిజనులకు యుటిఎఫ్ ఉదయగిరి శాఖ శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణంలో బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు ఉచితంగా పంపిణీ చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అందులో భాగంగానే ఉదయగిరిలో పారిశుద్ధ్య కార్మికులకు ఈ సరుకుల పంపిణీ చేపట్టామని యు.టి.ఎఫ్. నాయకులు తెలిపారు. యు.టి.ఎఫ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యు.టి.ఎఫ్. మండల అధ్యక్షులు గాజులపల్లి,  సుబ్బారెడ్డి, కార్యదర్శి గొల్లపల్లి ఎలిసా,  ఎం పి డి ఓ. ఆర్.ఎస్ వీరస్వామి, తాసిల్దార్ భీమా ప్రసాద్, ఎం ఈ ఓ. మోహన్ రావు, ఎస్ ఐ. జ్యోతి, రైతు సంఘం నాయకులు వెంకటయ్య,.