గుంటూరు నగర విలేఖరులకు నిత్యావసరాల పంపిణీ - మద్య విమోచన ప్రచార కమిటీ.

 


 గుంటూరు నగర విలేఖరులకు నిత్యావసరాల పంపిణీ - మద్య విమోచన ప్రచార కమిటీ.
 
  గుంటూరు ,ఏప్రిల్ 24 (అంతిమ తీర్పు) :  నగరంలోని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన 120 మంది విలేఖరులకు పది కేజీల బియ్యం తో పాటు 1.50 లక్షల రూపాయల విలువైన నిత్యావసరాలను మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ఈనెల 24వ తేదీన పంపిణీ చేశారు. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ విభాగ అధికార యంత్రాంగం, ఆళ్ల శివారెడ్డి,  వీరారెడ్డి, సి.హెచ్. చక్రపాణి,  పి. పోతురాజు, కన్నా మాస్టర్, చలపతి విద్యాసంస్థల అధినేత వీరాంజనేయులు సహకారంతో మీడియా మిత్రులకు నిత్యావసరాలను వారివారి ఆఫీసులకు స్వయంగా వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం  రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ కరోనా విపత్తును ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయడంలో మీడియా ప్రధాన భూమిక వహిస్తుంది. కరోనా  నేపథ్యంలో మీడియా మిత్రుల కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.ఈ  పంపిణీ కార్యక్రమంలో పి.రత్న రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.