సంధి కాలంలో ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతుంది

 


విజయవాడ/హైదరాబాద్            తేదీ : 6/4/2020


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో స్వయంసేవకులతో కూడి ఆర్ధిక ప్రయోజనం అందజేయడం , స్వప్రయోజనాల కై ప్రజల మద్దతు కోరడం వంటివి జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎం. రమేష్ కుమార్ అన్నారు. 


ఈ విషయం పై బిజిపి అధ్యక్షుడు, సిపిఐ కార్యదర్శి వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారని, 13 జిల్లాల జిల్లా ఎన్నికల పరిశీలకులు / జిల్లా కలెక్టర్లు లకు సోమవారం లేఖ వ్రాయడం జరిగిందని ఆయన తెలిపారు.


ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. కరోనా పరిస్థితి సమయంలో ప్రజలకు ప్రయోజనాల చేకూర్చే పంపిణీ కొత్త పథకం ఎన్నికల ఉల్లంఘన కింద రాదని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ వాడుకలో లేదని తెలిపారు. 


ఏది ఏమయినప్పటికీ, ఈ సంధి కాలంలో ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతుందని తెలియ చేస్తున్నామన్నారు. పోటీ చేసే అభ్యర్థులు వారి స్వయ ప్రయోజనం కోసం ప్రచారం చెయ్యడం, ఓటర్లు ను ప్రభావితం చెయ్యడం ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. కావున అటువంటి సంఘటన పై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి, నిజానిజాలను విచారించి, ఎన్నికల కమిషన్  దృష్టికి తీసుకుని రావాలన్నారు. 


సంబంధిత అధికారులందరూ పర్యవేక్షణ ద్వారా అటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్. రమేష్ కుమార్ వారి లేఖలో పేర్కొన్నారు.


 


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు