మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ..

మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ..


బియ్యం పంపిణీ చేస్తున్న ట్రస్ట్ అధ్యక్షుడు షబ్బీర్.
గూడూరు: మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా గూడూరు పట్టణము మరియు రూరల్ ప్రాంతాల్లో గత 17 రోజుల నుండి ఆహార పొట్లాలు,బ్రెడ్స్, పండ్లు, సానిటైజేషన్ మాస్కులు మజ్జిగ ప్యాకెట్స్, కూరగాయలు పంపిణీ చేస్తూ వస్తున్నాం, అందులో భాగంగానే 18 వ రోజు  నెల్లటూరు గ్రామంలో బియ్యం పంపిణి చేయడం జరిగింది అని మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్. షబ్బీర్ తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ నెల్లటూరు గ్రామంలో ఉన్న పేద ప్రజలు రోజువారీ పని లేక రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో వున్నారని అక్కడి వారు కొంతమంది మిత్ర ఫౌండేషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది అని కావున ఈ రోజు  కొంతమంది నా మిత్రులు  నరేంద్ర (జపాన్), కిరణ్ కుమార్ (ఉత్తర ప్రదేశ్), వెంకటేష్ (చెన్నై) మరియు గుణ శేఖర్ (బెంగుళూరు)ల సహాయ సహకారాలతో 35 కుటుంబాల వారికి బియ్యం పంపిణీ చేయడం జరిగిందని ఇదే విధంగా లాక్డౌన్ ఉన్నంత కాలం మిత్రుల సాయంతో మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటామని అన్నారు. మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమానికి సహకారం అందించిన మిత్రులందరికీ  హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో
మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షబ్బీర్, సభ్యులు అబ్దుల్లా, జాఫర్ అలీ, జియావుల్ హక్,ఆరీఫ్, రియాజ్, షాకీర్, అయాజ్ తదితరులు పాల్గొనడం జరిగింది.