లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ

లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ


ఎమ్మిగనూరు,టౌన్,ఏప్రిల్ 14 (అంతిమతీర్పు):-మన దేశ ప్రజల ప్రాణాలను  కబలిస్తున్న కరోన వైరస్ ధాటికి పట్టణ,గ్రామీణ ప్రాంత ప్రజలు అడుగు బయట పెట్టలేని తరుణంలో స్థానిక హెచ్ బి ఎస్  కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకునిఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి  మాజీ ఎమ్మెల్యే బివి. జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు  తెదేపా పట్టణ యువ నాయకులు  దయాసాగర్ 21వ వార్డులోని పిరమిడ్,పెద్దాసుపత్రి,గీతమందిరం, ఆడివప్పమఠం దగ్గర తదితర ప్రాంతాల్లో నివసించే నిరుపేద కుటుంబాలు అయినా  చెయ్యి ఆడితే గానీ డొక్కాడని పరిస్థితి గల నిరుపేద కుటుంబాలు గల సుమారు 250 కుటుంబాల వారికి  కావాల్సిన బియ్యం,బ్యాళ్లు, కారం,గోధుమపిండి, ఉప్మారవ్వ,సన్ ఫ్లవర్ ఆయిల్,2 dettol సబ్బులు  పంపిణీ చేయడం జరిగిందని టిడిపి యువ నాయకులు దయాసాగర్ తెలిపారు.ఈ సందర్భంగా వారికి కాలనీవాసులు హృదయ పూర్వక ధన్యవాదాలుతెలుపుతూ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాబట్టి ఇలాంటి సమయంలో మీ సేవలు మాకు ఎంతో అవసరమని ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నెన్నో చేయాలని కాలనీవాసులు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్, రవి,విజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
21వ శతాబ్దం మనదే...మోదీ
Image
బాలల దినోత్సవ సందర్భంగా    వాసవి క్లబ్    ఆధ్వర్యంలో.నోట్ బుక్స్ పంపిణీ..
Image
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*