డాక్టర్లకు, మాస్కులు కూడా ఇవ్వటం లేదు.

 టీడీపీ మాజీ మంత్రి జవహర్... 


కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇప్పటి వరకూ 2,352 కోట్లు ఇచ్చింది.
పంచాయతీలకు 14వ ఆర్ధిక సంఘం ద్వారా ఇచ్చిన నిధులు రూ.870 కోట్లు,మునిసిపాలిటీలకు 14వ ఆర్ధిక సంఘం ద్వారా ఇచ్చిన  నిధులు రూ.431 కోట్లు


రెవెన్యూ లోటు భర్తీ కింద, 15వ ఆర్ధిక సంఘం ఇచ్చే నిధులు రూ.491.41 కోట్లు,విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్ కింద రూ.559.50 కోట్లు. 
మరి వైకాపా ప్రభుత్వం ఏమి చేసింది ?బియ్యం, కందిపప్పు కేంద్రమే పంపించింది.కనీసం డాక్టర్లకు, మాస్కులు కూడా ఇవ్వటం లేదు.


రోడ్ల మీద బ్లీచింగ్ తప్ప ఏమి చెయ్యటం లేదు.చివరకు,షెల్టర్లలో ఉండే పేదలకు ఖర్చు పెట్టే ఖర్చు కూడా, కేంద్రమే ఇస్తుంది.ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించి,తాను తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ని కూడా తుంగలో తొక్కారు జగన్ గారు.


స్థానిక ఎన్నికలలో నిలబడిన వైకాపా అభ్యర్థులతో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఇప్పించి ఎన్నికల్లో ఓటు వైకాపా వెయ్యాలని జగన్ ప్రచారం చేయించడం దారుణమైన చర్య