ముఖ్యమంత్రుల సహాయనిధికి కడప జిల్లా కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ పూర్వ విద్యార్థుల విరాళం


అమరావతి, :  సీఎం సహాయనిధికి కడప జిల్లా కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ పూర్వ విద్యార్థులు విరాళం.


కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం కడప జిల్లాకు చెందిన కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ పూర్వ విద్యార్థులు  తమ వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 లక్షలు, తెలంగాణ  ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 లక్షలు మొత్తం 4 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు.  ఈ మేరకు కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ పూర్వ విద్యార్థుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార  పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయం రీజినల్ ఇన్మరేషన్ ఇంజినీర్ సి.వి.కృష్ణారెడ్డి  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సి.వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం ఇరు రాష్ట్రాలు తీసుకుంటున్న నివారణ చర్యలు అమోఘమని కోనియాడారు. త్వరలోనే  ఈ మహమ్మారి కరోనా అంతమొందాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ వైరస్ నుంచి విముక్తి కలగాలని ఆయన కోరారు. 


ప్రజలంతా సామాజిక దూరం పాటించి కరోనాను వ్యాప్తి చెందకుండా నివారించాలని కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస రావుతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు కోరారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండి కరోనా కట్టడికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.