తెలంగాణ లాక్‌డౌన్‌పై కేసీఆర్ క్లారిటీ..

తెలంగాణ లాక్‌డౌన్‌పై కేసీఆర్ క్లారిటీ..


హైదరాబాద్, ఏప్రిల్ 11 ;
యావత్ భారతమంతా 21రోజుల లాక్ డౌన్ లో భాగంగా ఇళ్లకే పరిమితమైంది. కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికీ తగ్గు ముఖం పట్టకపోవడంతో లాక్ డౌన్ సమయాన్ని పొడిగించాలని భావించాయి రాష్ట్రాలు. ఈ మేరకు ప్రధానితో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన సీఎంలు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 
దేశం మొత్తం గురించి ప్రధాని నిర్ణయం ఆదివారం ప్రకటిస్తారనగా ఇప్పటికే పంజాబ్, ఢిల్లీ, ఒడిశాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కన్ఫామ్ చేసేశాయి. ఇప్పుడు తెలంగాణ లాక్‌డౌన్ గురించి రాష్ట్ర ప్రజల సందేహాలపై క్లారిటీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. శనివారం ఏప్రిల్ 11న మీటింగ్ పెట్టి స్పష్టం చేశారు. 


ముందు చెప్పినట్లుగానే ఇతర దేశాలనుంచి ఉత్తరాధికి వచ్చి అక్కడి నుంచి మనకొచ్చింది. 


ఇప్పటివరకూ కరోనా కేసులు 503నమోదయ్యాయి. 14 మంది చనిపోగా, 96 మంది కోలుకున్నారు. 


మన దగ్గర హాస్పిటల్లో 393మంది ఉన్నారు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిని 1200మందిని పట్టుకొచ్చి టెస్టులు నిర్వహించాం.


ఇప్పుడు క్వారంటైన్లో 1650మంది ఉన్నారు. 


కేసులు నమోదవడం తగ్గింది. ఒకట్రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారు


వ్యాధి ప్రభలకుండా నిరోధించే చర్యలు.. ముమ్మరం చేశాం. ప్రజల నుంచి సహకారం అందుతుంది. రాష్ట్రంలో 243చోట్లు ఇటువంటివి జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 123, ఇతర ప్రదేశాల్లో 120ప్రదేశాల్లో టెస్టులు చేస్తున్నాం. 


ఇప్పటి వరకూ ఒక్కరి పరిస్థితి కూడా విషమించకుండానే చర్యలు తీసుకుంటున్నాం.


మహారాష్ట్రలో వైరస్ ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి మనకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సీరియస్ గా తీసుకుని అంతా బంద్ చేశాం.


ఏప్రిల్ 30వరకూ లాక్ డౌన్ కొనసాగించి.. మే1 తర్వాత పరిస్థితిని బట్టి తర్వాత చర్యలు తీసుకుంటాం.