మన్నేటి. వెంకటరెడ్డి సేవలు మమకారానికి నిలువెత్తు నిదర్శనం. :ఉదయగిరి సి.ఐ ఉప్పాల. సత్యనారాయణ

మన్నేటి. వెంకటరెడ్డి సేవలు మమకారానికి నిలువెత్తు నిదర్శనం. :ఉదయగిరి సి.ఐ ఉప్పాల. సత్యనారాయణ


ఉదయగిరి, ఏప్రిల్ 4 (అంతిమతీర్పు ఇంచార్జ్-దయాకర్ రెడ్డి) ఉదయగిరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మన ఫౌండేషన్ ప్రతినిధి మన్నేటి. వెంకటరెడ్డి సేవలు మమకారానికి నిలువెత్తు నిదర్శనమని ఉదయగిరి సి.ఐ ఉప్పాల. సత్యనారాయణ కొనియాడారు. ఉదయగిరి మండలంలోని కొండాయపాళెం పంచాయితీ పరిధిలోని 7 గ్రామాల ప్రజలకు మన్నేటి.వెంకటరెడ్డి కూరగాయల పంపిణీకి శ్రీకారం చుట్టిన సేవా కార్యక్రమానికి ఉదయగిరి సి.ఐ ఉప్పాల. సత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరై లాంచనంగా కూరగాయలను ఇంటింటికీ పంపిణీ చేశారు. గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మన్నేటి.వెంకటరెడ్డి బెంగుళూరులో వ్యాపారరీత్యా స్థిరపడినప్పటికీ జన్మభూమిపై మమకారంతో మన ఫౌండేషన్ స్థాపించి కొండాయపాళెం పంచాయితీలో విస్తృతంగా సేవా కార్యక్రమాలను తన అనుచరుల ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదేమో. ఇప్పటికే వాటర్ ఫ్లాంట్, గ్రీన్ పార్క్, పాఠశాలలో అదనపు తరగతి గదులు, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా క్రీడా పరికరాలు పంపిణీ తదితరాలతో మనసున్న మారాజుగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తాజాగా కరోనా వైరస్ విపత్తు నేపధ్యంలో ప్రజలందరూ వారి వారి నివాసాలకే పరిమితమైన విషయాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో డెల్టా ప్రాంతాల సేవాతత్పరులకు ధీటుగా మెట్ట ప్రాంతంలో నిత్యావసర ఫల సరుకుల పంపిణీకి ముందడుగు వేసి ఔరా అనిపిస్తున్నారు. కొండాయపాళెం పంచాయితీ పరిధిలోని పలు గ్రామాల ప్రజలకు అధికంగా కూలిపనులే జీవనాధారంగా ఉంటాయి. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు మన్నేటి నేతృత్వంలోని మన ఫౌండేషన్ ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో కూరగాయల పంపిణీకి సిద్ధమైంది.