ఆన్‌లైన్‌లో పెట్టాం..కరెంటు బిల్లు కట్టండి

ఆన్‌లైన్‌లో పెట్టాం..కరెంటు బిల్లు కట్టండి
ప్రజలకు దక్షిణ డిస్కం సూచన
హైదరాబాద్‌: ఈ నెల కరెంటు బిల్లులను ఆన్‌లైన్‌లో పెట్టామని, ప్రజలంతా వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌- డిస్కం) సూచించింది. 2019 మార్చి నెలలో మీ ఇంటికి వాడిన కరెంటుకు 2019 ఏప్రిల్‌ మొదటివారంలో బిల్లు వచ్చి ఉంటుంది కదా. అంతే మొత్తం సొమ్మును ఇప్పుడు కూడా కట్టాలని ప్రతి వినియోగదారుడి ఇంటి కరెంట్‌ కనెక్షన్‌ పేరుతో డిస్కం వెబ్‌సైట్‌లో పెట్టారు. మీ కరెంటు బిల్లు సంఖ్యను టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే మీరు కట్టాల్సిన సొమ్ము ఎంతనేది కనిపిస్తుంది. ఆన్‌లైన్‌ ద్వారా బిల్లు చెల్లించాలని సూచించింది.