*07–04–2020*
*అమరావతి*
*కోవిడ్ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
*అమరావతి:*
*కోవిడ్ నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
*సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు హాజరు*
*క్రమంగా కరోనా కేసులు తగ్గే అవకాశం – అధికారుల విశ్లేషణ:*
రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులపై వివరాలు అందించిన అధికారులు
సోమవారం సాయంత్రం 6 గంటనుంచి మంగళవారం ఉదయం వరకూ 150 కోవిడ్ నిర్దారణా పరీక్షలు నిర్వహించామన్న అధికారులు
ఒకే పాజిటివ్ కేసు వచ్చిందన్న అధికారులు
ఢిల్లీ నుంచి వచ్చిన వారికి, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయని వెల్లడించిన అధికారులు
క్రమంగా కేసులు సంఖ్య తగ్గవచ్చని భావిస్తున్న అధికారులు
ఉదయం 9 గంటలవరకూ మొత్తం 304 పాజిటివ్ కేసులు నమోదు
ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 997 మందికి పరీక్షలు, ఇందులో 196 మందికి కరోనా పాజిటివ్
వీరితో కాంటాక్ట్ అయిన వారు, కలిసి ప్రయాణించిన వారు, కనీసం 3–4 గంటలు వారితో ఉన్నవారిలో 2400 మందికి పరీక్షలు
ఇందులో కోవిడ్ –19 పాజిటివ్‌గా వచ్చిన వారు 84
ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టుల్లో 280 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
విదేశాలనుంచి వచ్చిన వారికి 205 మందికి పరీక్షలు
ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్
విదేశాలనుంచి వచ్చిన వారితో కాంటాక్టు అయిన 120 మందికి పరీక్షలు
వీరిలో 6 గురికి పాజిటివ్ వచ్చింది
కరోనా లక్షణాలుగా భావించిన వారిలో 134 మందికి పరీక్షలు చేస్తే 7గురికి నెగెటివ్
*హాట్‌స్పాట్లు, కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారు, ర్యాండమ్ పరీక్షలపై దృష్టి:*
– ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు పూర్తయిన తర్వాత ఎవరెవరికి పరీక్షలు నిర్వహించాలన్న దాని పైనా సమావేశంలో చర్చ.
– కుటుంబ సర్వేద్వారా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడి.
– హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్ సర్వేపైన కూడా దృష్టిపెట్టాలని స్పష్టంచేసిన సీఎం
– వైజాగ్‌లో నిర్వహించిన పద్ధతిలో ర్యాండర్ సర్వేలు జరగాలని అ«ధికారులకు సీఎం ఆదేశం.
*వసతులు, సదుపాయాల మెరుగుపై దృష్టి:*
– క్వారంటైన్లు, క్యాంపుల్లో ఉన్న సదుపాయాలు, వసతులను పెంచడానికి ప్రధానంగా దృష్టిపెట్టాలని ఆదేశించిన సీఎం.
– ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ క్వారంటైన్లలో సుమారు 5300కుపైగా ప్రజలున్నారని వివరాలందించిన అధికారులు
– విదేశాలనుంచి వచ్చిన వారిలో ఇంకా హోం క్వారంటైన్‌లో ఉన్నవారు 19,247. వీరిని ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్న అధికారులు.
– వీరి ఐసోలేషన్ పీరియడ్ ముగిసిందని, ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్ కొనసాగిస్తున్నామని వెల్లడించిన అధికారులు.
– వీరుకాక ఒక లక్ష మంది వరకూ హోం క్వారంటైన్‌లో వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు పర్యవేక్షణలో ఉన్నారని, సిబ్బంది ఎప్పటికప్పుడు వీరిని పర్యవేక్షిస్తున్నారని వెల్లడించిన అధికారులు.
*కోవిడ్ ఆస్పత్రుల సన్నద్ధతపై దృష్టి:*
– క్రిటికల్ కేర్ కోసం నిర్దేశించిన కోవిడ్ ఆస్పత్రులు, అలాగే జిల్లాల వారీగా నిర్దేశించుకున్న కోవిడ్ ఆస్పత్రుల సన్నద్ధతపైనా దృష్టిపెట్టాలని ఆదేశించిన సీఎం.
– ఈ ఆస్పత్రుల్లో సదుపాయాల్లో నాణ్యత ఉండాలని స్పష్టంచేసిన సీఎం.
– రూపొందించుకున్న ఎస్‌ఓపీ ప్రకారం ... ప్రమాణాలు పాటించాలని స్పష్టంచేసిన సీఎం.
– వచ్చే సోమవారం నాటికి అనుకున్న ప్రమాణాల ప్రకారం వీటన్నింటిలోనూ వసతులు ఏర్పాటు చేస్తామన్న అధికారులు.
– అలాగే క్వారంటైన్లు, క్యాంపుల్లో కూడా మరోసారి వసతులపై పరిశీలన చేసి, ఎక్కడైనా మెరుగుపరచాల్సిన అంశాలు ఉంటే.. వెంటనే దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం.
*వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్‌పై సమీక్ష:*
– వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయని, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని వెల్లడించిన అధికారులు.
– ప్రతిరోజూ కనీసం 150 ట్రక్కుల వరకూ అరటిని ఎగుమతిచేస్తున్నామని, మరోవైపు మార్కెటింగ్‌శాఖకూడా కొనుగోలుచేసి స్థానిక మార్కెట్లకు సరఫరాచేస్తున్నామని వెల్లడించిన అధికారులు.
– టమోటా క్రమంగా దిగుమతులు తగ్గుతున్నుందున మార్కెట్లోనే అమ్ముడుపోతోందని... ఈ పంట విక్రయం విషయంలో సమస్యలు తొలగిపోయాయని వెల్లడించిన అధికారులు.
– బొప్పాయి, మామిడి పంట కొనుగోలుపైనా దృష్టిపెట్టామని వెల్లడించిన అధికారులు.
– కర్నూలు వెలుపల ఉల్లిమార్కెట్ ఏర్పాటుచేసి.. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన అధికారులు.
– ఆక్వా ఉత్పత్తుల్లో కూడా క్రమంగా ఎగుమతులు పెరిగాయని, కనీసం రోజుకు 40 కంటైనర్ల వరకూ ఎగుమతి అవుతోందని తెలిపిన అధికారులు.
– అలాగే ప్రాససింగ్, కోల్డు స్టోరీజీ ప్లాంట్లు కూడా దాదాపుగా తెరుచుకున్నాయని వెల్లడించిన అధికారులు.
– అక్కడక్కడా అకాల వర్షాలపై ఆరాతీసిన సీఎం. సంబంధిత రైతులను గుర్తించి వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. చర్యలు చేపట్టామని వెల్లడించిన అధికారులు.