పోలీసులకు జర్నలిస్తులకు ఆహారాన్ని అందించిన డాక్టర్ ప్రణీత్...

పోలీసులకు జర్నలిస్తులకు ఆహారాన్ని అందించిన డాక్టర్ ప్రణీత్...
ఆత్మకూరు అంతిమ తీర్పు ఇన్చార్జ్ రహ్మత్ ఆలీ ....ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలో పనిచేచున్న పలు స్టేషన్లకు చెందిన సుమారు మూడువందల మంది పోలీస్ సిబ్బందికి స్థానిక ఆత్మకూరు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కు ఆత్మకూరు సి.ఐ. పాపారావు నేతృత్వంలో వెంకటేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రణీత్ ఆహారాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆత్మకూరు  సి.ఐ. పాపారావు మాట్లాడుతూ లాక్ డౌన్ లో భాగంగా విధినిర్వహణలో రాత్రంబవళ్ళు సేవలు అందిస్తున్న పోలీసు సిబ్బంది భోజనానికి హోటళ్లు లేక అనేక ఇబ్బందులను ఎదురుకుంటున్న నేపథ్యంలో   వెంకటేశ్వర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యం.డి. డాక్టర్ ప్రణీత్ 300 మంది పోలీస్ సిబ్బందికి స్థానిక ప్రింట్& ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్తులకు ఆహారాన్ని అందించడం సంతోష దాయకమన్నారు అనంతరం డాక్టర్ ప్రణీత్ మాట్లాడుతూ కరోన వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రజలందరూ స్వీయ నిర్బంధాన్ని పాటించి ఇంటికే పరిమితం కావాలన్నారు , లాక్ డౌన్ను  ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకోవాలన్నారు ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖలు ఆదేశించిన మార్గదర్శకాలను పాటించాలన్నారు  ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్.ఐ. సంతోష్ కుమార్ రెడ్డి పోలీసు సిబ్బంది తదితరులు పాలోన్నారు..